హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిన నేపథ్యంలో వాట్సన్ స్పందించాడు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో మహిళల అర్థనగ్న చిత్రాలతో వాట్సన్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఆ ఫోటోలకు అసభ్యకరమైన కామెంట్లు కూడా చేశారు. అయితే తన రెండు అకౌంట్లు హ్యాక్ అయినట్లు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ తెలిపాడు. వాట్సన్ పర్సనల్ ఇన్‌స్టా అకౌంట్లో కనిపించిన ఫోటోల స్క్రీన్‌షాట్స్ ను ఓ బ్రిటీష్ పత్రిక ప్రచురించింది. ఇన్‌స్టా, ట్విట్టర్లో వాట్సన్‌కు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆసీస్ క్రికెటర్ మొత్తం 59 టెస్టులు, 190 వన్డేలు ఆడాడు. 2016లో అతను రిటైర్ అయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm