హైదరాబాద్ : థాయ్‌లాండ్‌లో 13 అడుగుల పొడవైన నాగుపామును సర్పాల పరిరక్షక బృందం పట్టుకొంది. ఓ ఎస్టేట్‌లో ఈ పామును గుర్తించిన స్థానికులు సర్పాల పరిరక్షక బృందానికి సమాచారం అందించారు. దీంతో వారు వివిధ ప్రయత్నాల తరువాత పామును పట్టుకొన్నారు. ఈ పాము దాదాపు 15 కిలోల బరువుతో, నాలుగు మీటర్లకుపైగా పొడవు ఉంది. ఇప్పటి వరకు థాయ్‌లాండ్‌లో దొరికిన పాముల్లో మూడో అత్యంత పొడవైనదిగా సర్పాల సంరక్షకులు తెలిపారు. ఈ పామును సమీప అడవుల్లో వదిలి పెట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm