హైదరాబాద్ : హీరోగా 'ఆర్ ఎక్స్ 100' తరువాత ఆ స్థాయిలో కార్తికేయ హిట్ కొట్టలేకపోయాడు. కథల విషయంలో జాగ్రత్తలు తీసుకున్న ఆయన, శేఖర్ రెడ్డి దర్శకత్వంలో '90 ML' సినిమా చేస్తున్నాడు. అశోక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు.
'వినిపించుకోరు వినిపించుకోరు అమ్మాయిలెవ్వరూ వినిపించుకోరు' అనే పాటను విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం .. చంద్రబోస్ సాహిత్యం .. రాహుల్ సిప్లి గంజ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ప్రియురాలి కోపానికి గురైన కథానాయకుడు, తన తాగుబోతు బృందంతో కలిసి అమ్మాయిల ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాటగా అనిపిస్తోంది. మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసేదిగానే ఈ పాట వుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 05:16PM