హైదరాబాద్ : అమెరికా నుంచి ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకూ ఒక్క నాన్ స్టాప్ విమానం కూడా ప్రయాణించలేదు. అయితే తొలిసారిగా ఈ నెల 18న న్యూయార్క్ నుంచి సిడ్నీకి 20 గంటల నాన్‌స్టాప్ విమానాన్ని నడిపేందుకు క్వాంటాస్ ఎయిర్వేస్ లిమిటెడ్ సిద్ధమైంది. భూమిలో సగం దూరం ఉండే ఈ దూరాన్ని నాన్‌స్టాప్‌గా విమానాన్ని నడిపిన సంస్థగా క్వాంటాస్ ఎయిర్వేస్ గుర్తింపు పొందనుంది. మధ్యలో విరామం లేకుండా ఇంత వరకూ ఏ విమానయాన సంస్థ కూడా ఈ రికార్డ్‌ను సాధించలేదు. అయితే ఈ విధంగా ఏకంగా 20 గంటలపాటు ఎత్తులో ప్రయాణమంటే ప్రయాణికులకు అత్యంత ప్రతికూలమైన పరిస్థితులు తప్పవని చెప్పాలి. ప్రయాణికుల తీవ్ర జెట్ లాగ్(తీవ్రమైన అలసటతో నిద్రమత్తు)తో బాధపడే అవకాశం ఉంటుంది. అయితే తొలిసారిగా సుధీర్ఘంగా ప్రయాణం చేయనున్న ఈ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందిని వైద్యులు, పరిశోధకుల బృందం పరిశీలించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm