టెక్సాస్ : అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రెసిడెంట్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రైమరీల ఎంపికకు సంబంధించి ప్రక్రియలో టెక్సాస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటీటివ్స్ స్పీకర్ డెన్నిస్ బొన్నెన్ తమ పార్టీకే చెందిన అధ్యక్షుడు ట్రంప్, ఇతర నేతలను విమర్శించారు. ప్రైమరీల అభ్యర్థులనే లక్ష్యంగా చేసుకొని డెన్నిస్ అన్నమాటలు, రాష్ట్రంలోని డెమోక్రెటిక్ లా మేకర్లతో సంప్రదించడానికి సొంత పార్టీ నేతలను తిట్టిన ఓ వీడియో బహిర్గతం కావడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. అయితే ఈ వీడియో తనను ఇరికించాలని తప్పుగా ఎడిట్ చేశారని డెన్నిస్ పేర్కొన్నారు.
ప్రైమరీల ఎంపికలో... తమ పార్టీకే చెందిన ట్రంప్, టెక్సాస్ లో తమను అణగదొక్కాలని చూస్తున్నారని డెన్నిస్ ఆరోపించారు. డెన్నిస్, తన సహచర రిపబ్లికన్ నేత మైఖేల్ క్విన్ సలివియన్, మరో రిపబ్లికన్ నేత డస్టిన్ బారోస్ లు జూన్ నెలలో పాల్గొన్న ఇంటర్వ్యూ వీడియో ఒకటి బహిర్గతమైంది. ఈ వీడియోను మైఖేల్ క్విన్ బహిర్గతం చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 11:12PM