హైదరాబాద్: ప్రముఖ ప్లేబాక్ సింగర్ గీతామాధురి తన కూతుర్ని అభిమానులకు పరిచయం చేసింది. గీతామాధురి, నటుడు నందు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఆగస్టు 9న పాప పుట్టింది. గీతామాధురి తాజాగా తన కూతుర్ని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్చేసింది. అందరికీ నమస్కారం , నాపేరు దాక్షాయణి ప్రకృతి మీ గీత, నందుల బ్లాక్‌బస్టర్ బేబీ నేనే అంటూ తన ముద్దుల కూతురి ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్చేసింది గీతామాధురి.
Mon Jan 19, 2015 06:51 pm