హైదరాబాద్: ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్తున్న ఆటో దారి తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. గ్యాస్ సిలిండర్లతో నిండి ఉన్న ఆటో బోల్తాపడటంతో చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు లోనయ్యారు. శంకర్ మార్ట్ నుండి కోరంటి సిగ్నల్ వైపు వెళ్తుండగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ముందు ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm