హైదరాబాద్: ఎల్బీ నగర్లోని షైన్ చిన్నారుల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు చిన్నారులకకు తీవ్రంగా గాయలయ్యాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులను సమీపంలోని లోటస్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm