దక్షిణాఫ్రికా : బ్రిటన్ రాకుమారుల మధ్య ఇటీవల విభేదాలు చోటు చేసుకున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ప్రిన్స్ హ్యారీ స్పందిస్తూ, అవి నిజమేనని ఒప్పుకున్నారు. ఇటీవల హ్యారీ దక్షిణాఫ్రికాలో భార్య మేఘన్ మార్కెల్ తో కలిసి పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం మేము వేరు వేరు మార్గాల్లో ఉన్నాము. మా సోదర బంధంలో.. ఇద్దరమూ మంచి, చెడు రోజులను చవిచూశాము అని ప్రిన్స్ హ్యారీ అన్నారు. ఇటీవల తమ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయన్న పుకార్లపై హ్యారీ స్పందిస్తూ.. మాలో చీలిక నిజమే. మేము సోదరులము. ఎప్పటికీ సోదరులుగానే కొనసాగుతాం. ప్రస్తుతం మేము వేరు వేరు మార్గాల్లో ఉన్న మాట నిజమే. అయితే నేను విలియమ్స్ కోసం దారిలో వేచి ఉంటా.. నాకు తెలుసు, అతను కూడా నాకోసం వేచివుంటారు అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 21,2019 11:21PM