దేవీచౌక్: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. కళాశాల ఆర్ట్స్ బ్లాక్‌లోని జాగ్రఫీ ప్రయోగశాల బయట ఉన్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్‌కు గురై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున పొగలు రావడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ నిలిపివేసి మంటలను అదుపుచేశారు. కళాశాల స్లాబ్ లీకేజి వల్ల ప్రమాదం సంభవించిందని వైస్ ప్రిన్సిపల్ కె. ఆంజనేయులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయోగశాలలో విద్యార్థులు ఎవరూ లేరని చెప్పారు. కాలిపోయిన వైర్లను మార్చి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఆయన వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm