హైదరాబాద్: వియరబుల్స్ తయారీదారు నాయిస్ తన నూతన స్మార్ట్‌వాచ్ నాయిస్ఫిట్ ఎవాల్వ్‌ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 1.2 ఇంచుల అమోలెడ్ డిస్ప్లే, 9 రకాల స్పోర్ట్స్ మోడ్స్, యాక్టివిటీ ట్రాకర్, 24 అవర్ హార్ట్ రేట్ మానిటర్, స్టెప్ కౌంటర్, స్లీప్ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 180ఎంఏహెచ్ బ్యాటరీ, 3 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.5499 ధరకు ఈ వాచ్‌ను వినియోగదారులు రేపటి నుంచి నాయిస్ వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే ఇతర ఈ-కామర్స్ సైట్లలోనూ ఈ వాచ్‌ను విక్రయించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm