హైదరాబాద్ : ఆవు పిడకల వ్యాపారం అమెరికాకు పాకింది. ఆన్ లైన్ మార్కెట్లో ఆవు పేడ, పిడకల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. వీటికి భారత్ లో డిమాండ్ ఓ స్థాయిలో ఉంది. తాజాగా విదేశాల్లో.. ముఖ్యంగా అమెరికాలో వీటికి డిమాండ్ పెరుగుతోంది. న్యూజెర్సీలో ని ఓ షాప్ లో ఆవు పేడతో రూపొందించిన పిడకలు ప్యాకెట్లలో అమ్మకానికి పెట్టారు. 'ఇది ఓ భారతీయ ఉత్పత్తి, ఇది తినే పదార్థం కాదు. మతపరమైన విషయాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించాలి' అని ప్యాకెట్ మీద ముద్రించి ఉండటం విశేషం. పది పిడకలు ఉన్న ఓ ప్యాకెట్ ధర మన రూపాయల్లో 214 గా ఉంటుంది. స్థానికంగా నివసించే ఓ భారత సతంతికి చెందిన వ్యక్తి దీన్ని ఫోటో తీసి తన బంధువుకు పంపించాడు. అనంతరం ఇది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయబడి వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm