హైదరాబాద్ : సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ సైట్కు గాను యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలను ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే యూట్యూబ్ ప్రీమియం సేవలకు నెలకు రూ.129, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలకు నెలకు రూ.99 సబ్స్క్రిప్షన్ ప్లాన్లను గూగుల్ అప్పట్లో అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్లాన్లు ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేవలకు గాను ప్రీపెయిడ్ ప్లాన్లను గూగుల్ ఇవాళ లాంచ్ చేసింది. ఈ క్రమంలో యూట్యూబ్ ప్రీమియం సేవలు నెలకు రూ.139లకు, 3 నెలలకు రూ.399కి ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్ రూపంలో లభిస్తున్నాయి. అలాగే యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలు నెలకు రూ.109లకు, 3 నెలలకు రూ.309లకు ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్ రూపంలో లభిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm