హైదరాబాద్ : పూరి జగన్నాథ్ అందించిన కథతో ఆయన శిష్యుడు అనిల్ పాదూరి 'రొమాంటిక్' చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాతో కేతిక శర్మ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. 'నా వల్ల కాదే .. నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది నా వల్ల కాదే. నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపోద్ది నా వల్ల కాదే' అంటూ ఈ పాట సాగుతోంది.
నిన్న విడుదల చేసిన ఈ పాటకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ కాశ్యప్ సంగీతం .. ఆలాపన, భాస్కర భట్ల సాహిత్యం ఈ పాటను యూత్ లోకి బాగా తీసుకెళ్లాయి. పూరి - చార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథగా నడుస్తుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 25,2020 11:05AM