హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని కంగారూ ఐలాండ్‌ను కార్చిచ్చు దహించి వేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఎన్నో జంతువులు కాలి బూడిదయ్యాయి. మరెంతగానో వృక్షసంపద దహనమైంది. ప్రాణాలు దక్కించుకోవడానికి ఎటు వెళుతున్నాయో తెలియని పరిస్థితి వాటిది. ఎన్నో జంతువులు చెల్లాచెదురయ్యాయి. అలాంటి పరిస్థితే ఈ పసికూనలకు వచ్చింది. ఇవి కోలాలు.. ఈ అగ్నిప్రమాదంలో తమ తల్లి ఎక్కడికి వెళ్లిందో తెలియదు.. ఏమైందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఆకలితో అలమటిస్తున్న కోలా పిల్లలకు పాలిచ్చి కాపాడింది ఈ నక్క. జాతిభేదం లేకుండా.. తన బిడ్డల్లా వాటికి పాలివ్వడం అందరి హృదయాలను తట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాటి జంతువుగా ఆ నక్క .. ఈ పిల్లలకు పాలివ్వడం చూసి ప్రపంచం మురిసిపోయింది. కులం, మతం, వర్ణం పేరుతో కొట్టుకు చచ్చే మనుషుల కన్నా.. ఈ నక్క ఎంతో ఉత్తమమని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm