హైదరాబాద్: సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఏఏకి వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ లెఫ్ట్ పార్టీ అనుకూల విద్యార్థి సంఘాలు ర్యాలీ తీయగా, సీఏఏకు మద్దతుగా ఏబీవీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్సీయూలో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm