హైదరాబాద్: 'జబర్దస్త్' కామెడీ ప్రొగ్రామ్ తో తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించిన కమేడియన్లు ఒక్కొక్కరూ హీరోగా మారుతున్నారు. ఇప్పటికే షకలక శంకర్ ఓ సినిమా పూర్తి చేశాడు. తాజాగా సుడిగాలి సుధీర్ కూడా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ప్రస్తుతం జబర్దస్త్ .. కమేడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం '3 మంకీస్'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ కూడా ఇవాళ విడుదల చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm