హైదరాబాద్ : ఏనుగులు ఏ పని చేసినా అది కొంచెం కొత్తగా, ఆనందంగా కనిపిస్తుంది. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏనుగులను ఒక చోట నుండి మరో చోటుకు ట్రక్కుల్లో తరలిస్తుండగా రోడ్డుపై సిగ్నల్ పడింది. ఆ సమయంలో ఏనుగులు ఉన్న ట్రక్కు పక్కనే చెరుకు లోడు ఉన్న ఓ లారీ వచ్చి ఆగింది. పక్కనే ఉన్న ఏనుగులు ఆకలితో ఉండటంతో ఇదే సమయం అనుకుని చెరుకును ఆరగించడం ప్రారంభించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm