హైదరాబాద్ : రెండు దశాబ్దాల క్రితం నేను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను వాస్తవ రూపంలోకి తెచ్చేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది అన్నారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 20 ఏళ్ల క్రితం నేను 'భారతరత్న' సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా కన్న కల ఇప్పుడు సాకారం అయ్యిందని ఆమె అన్నారు. భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ విజయశాంతి ఫేస్బుక్ ద్వారా స్పందించారు.
Mon Jan 19, 2015 06:51 pm