హైదరాబాద్: 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా' అనే పాటకు మంచి స్పందన వస్తోంది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా కోసం చంద్రబోస్ రాసిన ఈ సాహిత్యానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ పాటకు యాంకర్ సుమ ఇచ్చిన హావభావాలకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమెలో గొప్ప నటికూడా ఉందని ఇప్పుడే తెలిసిందని కామెంట్లు చేస్తున్నారు.
గాయని సునీత పాట పాడుతుండగా సుమ హావభావాలు ప్రదర్శిస్తున్న సమయంలో సునీత ఈ వీడియో తీసింది. ప్రస్తుతం 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాట అందరి స్మార్ట్ఫోన్లలోనూ వినిపిస్తుంది. బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా రూపుదిద్దుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 19,2020 01:57PM