లోవా: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి.. కొన్నేళ్లుగా తనతో గొడవలు పడుతున్న ఓ మహిళను కిడ్నాప్ చేశాడు. ఆమెను గదిలో బంధించి తొమ్మిది గంటలపాటు ఓ టీవీ సీరియల్ చూపించాడు. ఈ విచిత్ర ఘటన అమెరికాలోని లోవా ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాబర్ట్ నోయేస్(52) అనే నల్లజాతీయుడికి ఓ తెల్లజాతి మహిళపై ఆగ్రహం వచ్చింది. వీరిద్దరి మధ్యా పలుమార్లు వివాదాలు జరిగాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు యువతిని రాబర్ట్ కిడ్నాప్ చేశాడు. కదిలితే ముక్కలుగా నరికి ఇంటర్‌స్టేట్ 380 రహదారి పొడవునా చల్లుతానని బెదిరించాడు. ఆ తర్వాత ఆమెను ఓ గదిలో బంధించి దాదాపు 9గంటలపాటు రూట్స్ అనే పాత అమెరికన్ టీవీ సీరియల్ చూపించాడు. ఇది చూస్తేనే నాపై నువ్వు చూపిస్తున్న జాతివివక్ష అర్థమవుతోంది అని ఆమెకు చెప్పాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రాబర్ట్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, 1977లో వచ్చిన రూట్స్ సీరియల్లో నల్లజాతి బానిసల జీవితాలను కళ్లకుగట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm