హైదరాబాద్: బంగారం కొనాలనునే పసిడి ప్రేమికులకు బుధవారం షాక్ తగిలింది. బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.520 పెరిగింది. స్వచ్ఛమైన బంగారం ధర రూ.43,000 మార్క్ దాటింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర రూ.40,000 మార్క్‌కు చేరువలో ఉంది. హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్ రేట్స్ చూస్తే 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.43,160 కాగా, 22 క్యారట్ ధర రూ.39,650. న్యూ ఢిల్లీలో బంగారం ధర రూ.462 పెరిగి రూ.42,000 మార్క్‌ను దాటింది. ప్రస్తుతం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.42,339. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,606.60 డాలర్లు. పెళ్లిళ్ల సీజన్లో బంగారానికి డిమాండ్ పెరుగుతుండటం, గ్లోబల్ ట్రెండ్స్ పాజిటీవ్‌గా ఉండటం బంగారం ధర పెరగడానికి కారణమని విశ్లేషిస్తున్నారు మార్కెట్ నిపుణులు.
Mon Jan 19, 2015 06:51 pm