హైదరాబాద్: కరోనా.. క్వారంటైన్.. ఐసోలేషన్.. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరి నోట విన్నా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. చైనాలోని వుహాన్లో బయటపడిన కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం వణికిపోతోంది. అచ్చం ఇలాంటి కథతోనే 2011లో ఓ సినిమా విడుదలైంది. పేరు కాంటాజియన్. తొమ్మిదేళ్ల క్రితమే దాదాపు ఇలాంటి నేపథ్యంతో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా నిండా ఇలాంటి పదజాలమే. విడుదలైనపుడు ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ప్రస్తుత కరోనా కాలంలో ఆ సినిమా విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది. తమిళ నటి వరలక్ష్మి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించింది. వైరస్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుందని పేర్కొంది. అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm