గుంటూరు: జీజీహెచ్లో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళను వైద్యులు చేర్చుకోలేదని బంధువులు చెబుతున్నారు. జీజీహెచ్ నుంచి ఇంటికి వెళ్లగానే మహిళ ప్రసవించింది. బిడ్డ మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. జీజీహెచ్ వైద్యుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm