హైదరాబాద్: బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందించారు. బాలకృష్ణ ఎందుకు మాట్లాడారో తెలియదని ఆయన చెప్పారు. సినీ ప్రముఖులతో సమావేశం తర్వాత మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతిపై చర్చించామన్నారు. ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నవారందరినీ సమావేశానికి పిలిచామని చెప్పారు. ఇండస్ట్రీని అంతా పిలిచి సమావేశం పెట్టమంటే తనకు అభ్యంతరంలేదన్నారు. సీఎం కేసీఆర్‌కు అన్ని విషయాలు వివరిస్తామని తలసాని స్పష్టం చేశారు
కాగా షూటింగులు మొదలు పెట్టే విషయంపై సీఎం కేసీఆర్‌ను సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కలిసి చర్చించిన విషయం తనకు తెలీదని బాలకృష్ణ అన్నారు. ఆ సమావేశానికి రావాలని తనను ఏ ఒక్కరూ పిలవలేదన్న బాలయ్య.. తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 28,2020 06:31PM