హైదరాబాద్: ప్రపంచపు అభిమాన భారతీయుడు బజాజ్ ఆటో, ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకుని తమ వినియోగదారులకు రిటైల్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తుంది. ఈ ప్రత్యేక భాగస్వామ్యంతో, బజాజ్ ఆటో వినియోగదారులు ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యొక్క నిష్ణాతులను మరియు భారతదేశ వ్యాప్తంగా విస్తృతశ్రేణి నెట్‌వర్క్‌ను చేరుకోవడం ద్వారా క్లిష్టత లేని సంపూర్ణమైన డిజిటల్ ప్రక్రియలు మరియు సేవలను పొందవచ్చు. భారతదేశంలో అతి పెద్ద బ్యాంకులలో ఒకటి హెచ్డీఎఫ్సీ బ్యాంక్. దేశవ్యాప్తంగా 5300కు పైగా శాఖలు కలిగి ఉండటంతో పాటుగా ఐదు కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకుకు ఉన్నారు. అదనంగా, డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలు, ప్రక్రియలలో అగ్రగాములలో ఒకటి హెచ్డీఎఫ్సీ బ్యాంక్. బజాజ్ ఆటో మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నడుమ భాగస్వామ్యం ఇప్పుడు ఋణంపై మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు పలు ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ భాగస్వామ్యం గురించి శ్రీ సారంగ్ కనాడీ, అధ్యక్షులు- మోటార్‌సైకిల్స్, బజాజ్ ఆటో లిమిటెడ్ మాట్లాడుతూ "హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. తద్వారా మా వినియోగదారులకు రిటైల్ ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించగలము. దేశవ్యాప్తంగా బ్యాంకు యొక్క ఉనికి, మేము మరింతగా మా వినియోగదారులను భారతదేశంలో చేరుకునేందుకు తోడ్పడటంతో పాటుగా కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా ఋణ మద్దతు కోరుకునే మా సంభావ్య వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తుంది. బజాజ్ ఆటో మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండూ కూడా క్లిష్టత లేని అనుభవాలను వినియోగదారులకు అందించనున్నాయి'' అని అన్నారు.
బజాజ్ ఆటో గురించి:
దాదాపు 70కు పైగా దేశాలలో 15 మిలియన్లకు పైగా మోటార్‌సైకిల్స్ విక్రయాలు జరుపబడుతున్న బజాజ్ బ్రాండ్ అసలైన ద వరల్డ్స్ ఫేవరేట్ బ్రాండ్‌గా నిలిచింది. భారతదేశపు నెంబర్ 1 మోటార్‌సైకిల్ ఎగుమతిదారునిగా, అంతర్జాతీయంగా విక్రయించబడుతున్న ప్రతి మూడు బైక్‌లలో రెండు బజాజ్ బ్యాడ్జ్ కలిగి ఉంటున్నాయి. సాంకేతికత, డిజైన్, నాణ్యత మరియు వినియోగదారుల సంతృప్తి ద్వారా అత్యుత్తమ మోటార్‌సైకిల్స్‌ను నిర్మించాలనే కంపెనీ యొక్క సాటిలేని నిబద్ధత, అంతర్జాతీయంగా ఎక్కువగా కనబడుతున్న భారతీయ బ్రాండ్‌గా నిలిచేలా చేసింది. లక్షలాది మంది సంతృప్తికరమైన వినియోగదారులు చూపిన నమ్మకం, రోడ్డుపై అత్యుత్తమ మోటార్‌సైకిల్స్‌ను తీర్చిదిద్దడానికి స్ఫూర్తి కలిగించింది. అదే డొమినార్ 250లో కూడా ప్రతిబింబిస్తుంది.
______________________________________________________________________________________________
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 04,2020 08:47AM