రాయ్‌గఢ్ : చత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జంజ్‌గిర్-చంపా జిల్లా మాజీ కలెక్టర్‌పై లైంగిక దాడి కేసు నమోదు అయింది. జిల్లా మాజీ కలెక్టర్ జేకే పాతక్‌పై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పరుల్ మథూర్ వెల్లడించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ... మే 15వ తేదీన తనపై లైంగిక దాడి జరిగినట్లుగా మహిళ ఫిర్యాదు చేసింది. కలెక్టర్ తన కార్యాలయంలోనే ఈ దారుణానికికి ఒడిగట్టినట్లుగా తెలిపింది. మహిళ నుంచి పూర్తిస్థాయిలో స్టేట్మెంట్ను తీసుకున్నామని అదేవిధంగా మొబైల్ రికార్డ్స్‌ను పరిశీలించినట్లు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm