హైదరాబాద్ : డెల్ టెక్నాలజీస్ తన ప్రీమియం కమర్షియల్ పిసి- లాటిట్యూడ్ 9510ని భారతదేశంలో విడుదల చేయగా, ఇది ప్రపంచంలో అత్యంత తెలివైన మరియు సురక్షితమైన బిజినెస్ అవసరాల కోసం తయారు చేసిన ప్రత్యేక పీసీ5. ఈ ఏడాది ప్రారంభంలో CES 2020లో, అల్ట్రా-ప్రీమియం 9000 లాటిట్యూడ్ సిరీస్‌ను డెల్ పరిచయం చేయగా, ఇది అత్యుత్తమ డిటెయిల్స్‌ను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూ లేనంత చిన్నదిగా, సన్నగా, పెద్ద డిస్ప్లేతో మరియు అద్భుత అనుభవాన్ని అందించేలా తయారు చేశారు. నూతన లాటిట్యూడ్ 9510 వ్యాపార వినియోగదారులు కోరుకునే-ఎక్కువ సమయం పని చేసుకునేందుకు అనుగుణంగా దీర్ఘకాలిక బ్యాటరీ జీవిత కాలాన్ని, ఏదైనా 15 అంగుళాల బిజినెస్ పీసీలతో పోల్చితే 34 గంటల2 పాటు అందిస్తూ, 5జి- రెడీ డిజైన్, శక్తివంతమైన ఆడియో ప్రత్యేకతలు, ఉత్పాదకతను పెంచే ఇంటెలిజెంట్ పరిష్కరణలను అందిస్తుంది. మన నిత్యం ఉపయోగించుకుంటూ, వాటిపై ఆధారపడే ఉపకరణాలు నాజూకుగా, తెలివిగా, కంప్యూటింగ్ శక్తితో ఉంటే, అవి వినియోగదారులు సమాచారంతో కూడిన నిర్ణయాలను తీసుకునేందుకు, చక్కని వ్యాపార ఫలితాలను అందుకునేందుకు సహకరిస్తాయి. ఆధునిక యుగంలో పని చేసే వారి ఎంపికలకు అనుగుణంగా, మరింత సమర్థవంతంగా మరియు పోటీతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించేందుకు కావలసిన సాంకేతికత ఎంపికల అవసరమని డెల్ అర్థం చేసుకుంది. లాటిట్యూడ్ 9510తో డెల్ వాణిజ్య ల్యాప్‌టాప్ విభాగంలో భవిష్యత్తు-అవసరాలకు కావలసిన పీసీని తయారు చేసి, అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది 10వ తరం ఇంటెల్ ® vPro® ప్రాసెసర్లiతో కూడిన మొదటి ప్రాజెక్ట్ ఎథీనా-వెరిఫైడ్ (Project Athena-verified) వాణిజ్య పీసీ కాగా, ఇది శక్తిని మరియు పనితీరును అందించే జట్టుకు కావలసిన చోట మద్దతు అందిస్తుంది. లాటిట్యూడ్ 9510 దృఢమైన-అల్యూమినియం ఫినిషింగ్‌తో, డైమండ్-కట్ ఎడ్జ్‌లతో పని మరియు స్టైల్‌ను కోరుకునే వృత్తినిపుణులకు ఇది సరైన జోడి. ఇంటెల్® వై-ఫై (గిగ్+) మరియు 5జి-రెడీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సామర్థ్యాలు తమకు కావలసిన చోట ఎక్కువ ఉత్పాదకతను అందుకునేందుకు సహకరిస్తుంది. అద్భుతమైన 15 ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్ప్లేను 14 ఫారమ్ ఫ్యాక్టర్‌లో నిలుపుకునేందుకు ఈ డిజైన్ 5జి యాంటెన్నాలలను స్పీకర్లలో పొందుపరచి ఉంచడంతో, దాని కార్బన్ బ్లేడ్ ఫ్యాన్లు మరియు డ్యుయల్ హీట్ పైపులు నిశ్శబ్దంగా మరియు చల్లని-టచ్ అనుభవాన్ని అందిస్తాయి. లాటిట్యూడ్ 9510 2 వేరియెంట్లలో అందుబాటులోకి కాగా 2-ఇన్-1 కన్వర్టిబుల్ మరియు క్లామ్ షెల్ లాప్టాప్గా ఉద్యోగులు తాము పని చేసే చోట వినియోగించుకోవచ్చు. డెల్ టెక్నాలజీస్, ఇండియా క్లయింట్ సొల్యూషన్స్ గ్రూపుకు సీనియర్ డైరెక్టర్ డ జనరల్ మేనేజర్ ఇంద్రజిత్ బెల్గుండి మాట్లాడుతూ, మేము డిజిటల్‌గా కొనసాగే మరియు అనుసంధానించబడిన సమయాల్లో నావిగేట్ చేస్తున్నప్పుడు, మా వినియోగదారులు తమ ఉద్యోగులకు సులభమైన, తక్షణం వినియోగించుకునేందుకు అనువైన ఎండ్-యూజర్ కంప్యూటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, తమ ఉద్యోగులకు సరళమైన, రెడీ-టూ-వర్క్ అనుభవాన్ని అందించి, తాము చేస్తున్న పనుల్లో అలానే ఆటోమేటెడ్తో కూడిన ఐటీకి సాధికారత కల్పించి, ఓపెన్ మరియు ఇంటెలిజెంట్ మేనేజ్మెంట్ పరిష్కరణలను తేలికగా, సురక్షితంగా మరియు నిర్వహణకు అనుగుణంగా అవలవర్చుకునుంకు అవకాశం కల్పిస్తుందని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm