హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా మహమ్మారి సమయంలో ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా, యూఎస్, భారత్ నుండి వచ్చిన వ్యక్తులతో కూడిన వర్చువల్ ప్యానెల్ చర్చ నిర్వహించింది. మహమ్మారి సమయంలో కుటుంబ ఆరోగ్యం, పోషణకు భరోసా ఇవ్వడం ప్రాముఖ్యత అనే చర్చ దేశంలోని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై దృష్టి సారించింది. కుటుంబాలు వారి రోజువారీ ఆహారం, జీవనశైలిలో చేర్చగల నివారణ చర్యలను హైలైట్ చేసింది.
ఈ చర్చకు బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్, పైలేట్స్ ఎక్స్పర్ట్, డైట్- న్యూట్రిషన్ కన్సల్టెంట్ మాధురి రుయా, రీజినల్ హెడ్ - డైటెటిక్స్, మాక్స్ హెల్త్‌కేర్ - ఢిల్లీ రితికా సమద్దర్, ఎమిలీ ఫ్లీష్మాన్, Vp - గ్లోబల్ మార్కెటింగ్ డెవలప్మెంట్, ఆల్మాండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఈ ప్యానెల్‌ను హైదరాబాద్‌కు చెందిన RJ షెజ్జీ మోడరేట్ చేశారు. ఈ చర్చ ద్వారా, ప్యానెలిస్టులందరూ వారి వ్యక్తిగత జీవితాలు, పరిస్థితుల నుండి కథలను పంచుకున్నారు. భారతదేశం అంతటా ఉన్న కుటుంబాలు మహమ్మారి సమయంలో వారి జీవనశైలి, ఆహారం తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని ప్రేరేపించారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడం, వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన అల్పాహార అలవాట్లను పెంపొందించడం ప్రాముఖ్యతను ముఖ్యంగా ప్రస్తావించారుర. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, భద్రతను పెంచడానికి భారతదేశంలోని కుటుంబాలు వారి జీవనశైలిలో పొందుపరచగల చిన్న మార్పులను ప్యానలిస్ట్ లు హైలైట్ చేశారు.
చర్చ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ, నికోవిడ్ -19 కి నివారణను కనుగొనటానికి ప్రపంచం అవిరామంగా కృషి చేస్తుంది. కుటుంబ భద్రత, మంచి ఆరోగ్యం కోసం భార్యగా, తల్లిగా నా భరోసా కోసం తగిన నివారణ చర్యలు చేపట్టడం నా బాధ్యత అని నేను భావిస్తున్నాను. సాధారణమైన ఈ క్రొత్త ఆలోచనకు అనుకూలంగా సర్దుబాటు చేయడం నేర్చుకున్నప్పుడు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఆహారాలతో పాటు సరైన పోషకాహారంతో సహా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయడం మనం చేయగలిగే అతి ముఖ్యమైన విషయం. మీ కుటుంబ ఆహారంలో కొన్ని బాదంపప్పులను జోడించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించడానికి మంచి మార్గం. బాదం అనేది జింక్ యొక్క మూలం, ఇది పెరుగుదల, అభివృద్ధి , రోగనిరోధక పనితీరు నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.
మ్యాక్స్ హెల్త్‌కేర్-డిల్లీ, రీజినల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ నిప్రస్తుత మహమ్మారి, భారతీయ కుటుంబాలలో సరైన పోషకాహారం అవసరం అని గతంలో కంటే అధికంగా దాని ప్రాముఖ్యతను తెల్పింది. చాలా మంది భారతీయులు రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటిస్, ఊబకాయం వంటి వ్యాధులతో బాధపడుతున్నారు, వీరిలో ఒకరు కోవిడ్ -19 కి గురవుతున్నారు. అందువల్ల, కుటుంబాలు వారి ఆహారం, ఆరోగ్య సంరక్షణ అలవాట్లను పునఃసమీక్షించడం ఇంతకు ముందెన్నడూ సంభవించని ఇలాంటి పరిస్థితికి అడ్జస్ట్ అవడం చాలా ముఖ్యం. మీరు పైన పేర్కొన్న రోగాలలో ఒకదానితో బాధపడుతున్నా, లేదా అలాంటి ప్రమాదంలో ఉన్నా, శరీరం యొక్క మొత్తం ఆరోగ్యానికి తోడ్పడే బాదం, కాలానుగుణ పండ్లు, కూరగాయలు, పోషకాలు సమృద్ధిగా ఉన్న ప్రోబయోటిక్స్ వంటి గింజలను చేర్చడం మర్చిపోవద్దని అన్నారు.
పైలేట్స్ ఎక్స్పర్ట్, డైట్- న్యూట్రిషన్ కన్సల్టెంట్ మాధురి రుయా మాట్లాడుతూ, ప్రతీ వ్యక్తి శ్రేయస్సు కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర, స్వీయ సంరక్షణ సాధన చేయడం చాలా ముఖ్యం. అనిశ్చితి భయం ఆలోచనల చీకట్లు కమ్ముకున్నప్పుడు పైన పేర్కొన్న విషయాలు ప్రతి ఒక్కటి ప్రస్తుత సందర్భంలో ప్రధానంగా మారాయి. వ్యక్తులుగా, మా కుటుంబాన్ని, శ్రేయస్సును చూసుకోవటానికి మా వంతు కృషి చేయాలని నేను భావిస్తున్నాను. దీనిని సాధించడానికి మా జీవనశైలికి తగిన మార్పులు చేయడం అనేది సులభమైన మార్గం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం ద్వారా ప్రారంభించండి. రోజువారీ నడక, స్క్వాట్లు, జుంబా లేదా ఎరోబిక్స్ - కానీ సామాజిక దూర నిబంధనలను అనుసరించేటప్పుడు దీన్ని జాగ్రత్తగా పాటించండి. మీ ఫిట్నెస్ దినచర్యను సప్లిమెంట్ చేయండి, స్నాక్స్ సమయంలో తగిన పోషకాలతో కూడిన మరియు రోస్టెడ్ లేదా సాల్టెడ్ బాదం వంటి ఆహారాన్ని ఎంచుకోండి, ఇవి సంతృప్తికరమైన లక్షణాలను కలిగి ఉంటాయి. సంపూర్ణత్వ భావనలను ప్రోత్సహిస్తాయి. ఆరోగ్యకరమైన చిరుతిండి కాకుండా, బాదం అనేది రాగి మరియు ఫోలేట్ యొక్క మూలం, ఇవి రోగనిరోధక వ్యవస్థ యొక్క అత్యుత్తమ పనితీరుకు దోహదం చేస్తాయని అన్నారు.
కాలిఫోర్నియాలోని ఆల్మాండ్ బోర్డ్, గ్లోబల్ మార్కెటింగ్ డెవలప్మెంట్, Vp - ఎమిలీ ఫ్లీష్మాన్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో, కాలిఫోర్నియాలోని ఆల్మాండ్ బోర్డ్ సరైన పోషకాహారం, ప్రాముఖ్యత ఆవశ్యకతపై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి. హృదయ ఆరోగ్యం, మధుమేహం, బరువు నిర్వహణ, చర్మ ఆరోగ్యం గురించి మొత్తం బాదం ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరుస్తుందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 14,2020 05:43PM