సూడు సూడు 'నారన్నా' ఊరు నిన్ను పిలుస్తోంది 'మూలవాగు' బాధ జూడు తాపతాపకు తలుస్తోంది ||సూడు|| ఉరుకుడాపి 'మానేరు' నీ పాటే పాడుతోంది నీ అడుగు జాడలను మైలురాళ్ళుగ పాతింది ||సూడు|| 'ఏములాడ, సిరిసిల్ల'లు నీ పేరును జెపిస్తుంటె 'హనుమాజీ పేట' నేడు మొగులుముట్ట ఏడుస్తోంది ||సూడు||
గోదావరి 'గంగమ్మ'లు గోడుగోడున ఏడుస్తోంటె 'యమున, కృష్ణ, సరస్వతి' గోసజూడ తరంగాదు ||సూడు|| 'తల్లి తెలంగాణ' సూడు తల్లడమల్లడ మైతంది కోటానుకోట్ల తెలుగుజాతి పబ్బతివట్టి మొక్కుతోంది ||సూడు|| ప్రతి ఊరు పల్లె పల్లె మా నారాయణరెడ్డి కవి మల్లమల్ల పుట్టాలని బోనమెత్తి వేడుతోంది (మాకు జీవధాతువు 'బాపు' సినారె కు)