కలం యోధుడా.. కావ్య ధీరుడా.. మహానది పయోనిధీ దాశరథీ..శరథీ..రథీ ఆకాశవాణి ప్రయోక్త ఆకాంక్షలవాణి ప్రవక్త నీ చేతిలో బొగ్గుముక్క అక్షరాలై మండే అగ్గిచుక్క నీ జననం తెలంగాణ నీ పయనం రుద్రవీణ నీ కవనం అగ్నిధార నీ మరణం అశ్రుధార ఓ గజల్ రుబాయి గాలిబ్ గీతాల భాయి మహోంద్రోదయ తురాయి మహోద్యమ సిపాయి నీ తిమిరంలో సమరం అక్షరాల తెలుగుదనం నీ అభిమాన పునర్నవం స్ఫూర్తినిచ్చు వెలుగు వనం..!! -కటుకోఝ్వల రమేష్