Wed 22 Jul 12:49:40.641834 2020 తెలుగు భాషకు సరి కొత్త సొబగులు దిద్దివిశ్వంభరుడుగా తాను పేరు పొందిబహుభాష వేత్తగా సాహిత్యమున వెలిగిగేయకవి గా మారేను మన సినారెతెలంగాణ చరితకే తలమానికమైనకరీంనగర్ జిల్లా హనుమాజిపేటలోసింగిరెడ్డి వంశాన బుచ్చమ్మ మల్లన్నలకు జన్మనొందే కవిగా,పండితునిగా వాసికెక్కేప్రపంచ పదులలో అంతఃప్రాసను వాడిప్రపంచ జనులకు భవిత తోవ చూపెమధ్యతరగతి మందహాసమై వికసించిమానవ జీవనశైలి మార్గం వేసేనాగార్జున సాగరం,మట్టి మనిషి, ఆకాశం నడక నా తల్లి, ఇంటి పేరు చైతన్యం అక్షరాల గవాక్షరాలు లాంటి ఆణిముత్యాల రచనలు చేసి ఉన్నత పదవులను అలంకరించే.ఆధునీకాంధ్ర కవిత్వం-సంప్రదాయాలు ప్రయోగాలు పరిశోధన గ్రంథం తో విశ్వకీర్తి గాంచి తెలుగు భాషకు సరికొత్త శైలి చూపి సినారె ఆచంద్రతారార్కానం వెలుగునొందేచలనచిత్రాలలో స్తీ రూపు వర్ణించేతెలుగు గజళ్ళు లో ప్రభలు చిందేజ్ఞానపీఠం తోడ ఘనుడయ్యి పేరొందిపద్మభూషణుడయ్యి పరిమళించే- చిలకమారి తిరుపతి స్వరమయూరి 9640908491 చెన్నూర్