Fri 24 Jul 08:33:05.93136 2020 పల్లవి:.సింగిరెడ్డి సినారే తెలుగు వారి సిరి నీవేసింగిరెడ్డి సినారే తెలుగు వారి సిరి నీవేవీధి బడిన చదివిన విజ్ఞాన గని వీవే చరణం 1:పాట లైన గజలైనా బుర్ర కథలే ఐనా పద్యాలు గద్యాలు ప్రక్రియ లేవైనా అలవోకగా వ్రాసి మనసులనే దోచి ధ్రువ తారగ నిలిచిన ఘనుడీవె సినారేచరణం2పగలే నింగిలో వెన్నెలను పంచిజగతినే అందమైన ఊయలగా మార్చిలాలి పాట పాడి నిదుర బుచ్చుచూతెలుగు భాష గరిమను దశదిశలా చాటినచరణం:3నేలకు గాలికి కులమేదని ప్రశ్నిస్తూ జీవమున్న మనిషి కన్నా శిలలే మేలంటూవిశ్వాసం లేనిమనిషి కన్న శునకమే మిన్నని గళమెత్తి చాటిన స్రష్టవు నీవు స్రష్టవు నీవుచరణం:4అమ్మను దైవంతో అన్నను పెన్నిధిగా నాన్న మనసు వెన్నంటూ చాటుతూ స్నేహమే జీవితమని చెలిమి విలువనుశుక పికాల పాట ద్వారా తెలిపిన సినారేచరణం:5భరత మాత మెడలో పచ్చల హారమైనావుతెలుగు తల్లి సిగలోన కలికి తురాయైనావుజ్ఞానపీఠ పురస్కారమందిన ఓ సినారేసరి ఎవ్వరయ్య నీకు సాహితీ జగతిలో ----డా.బల్లూరి ఉమాదేవి