Wed 29 Jul 13:10:32.419749 2020 కవికుల వతంసుడుఏ చందన గిరీంద్రాలపై నుండోగాలి, కవిత్వమై వీస్తున్నప్పుడువసంతాలను వరించిన విరికన్నెలుఅరకన్నులు మోడ్చిన అక్షరాలై నవ్వినప్పుడుమహాత్ముల మానసాలలో వెలిగేమానవత్వంశుభాకృతులైపదిమంది కోసం ప్రసరించినప్పుడుమట్టి, గాలి, నిప్పు, నీరు, ఆకాశంకలంలో కలసి కావ్యంమనిషై నడిచొస్తున్నప్పుడుసినారె ….నువ్వు మాకుఋతుచక్రాన్ని గానమై స్పృశించేపరభృతమై కన్పిస్తావుపగడాల జాబిలి చెక్కిలి తడిమేకుఱ్ఱ గాడ్పువై అలరిస్తావుఓ సినారె ! నీవి కవితలా అవినీ కలం పుకిలించిన రసగుళికలుగుళికలా అవి మరులు గొల్పించేమదనసతి యౌవనకళికలుఅలుకలు నేర్చిన పలుకులకుకులుకులు నేర్పిన వాడాతరగలు సాగిన నుడికడలులకుతళుకులు తీర్చిన వాడాఅక్షరకన్యలకుకావ్య లక్షణాలను పొదిగిన వాడాగంధర్వలోక మధురకవనగానసుధారసమ్మును గ్రోలిన వాడాజోహారు కవి వసంతరాయా జోహారు.-డాక్టర్. బి. బాలకృష్ణ,9948997983.