మొటిమల నివారణకు... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

మొటిమల నివారణకు...

వెల్లుల్లితో ఆరోగ్యం ఒక్కటే కాదు అందం కూడా ఇనుమడిస్తుంది. ముఖ్యంగా ముఖంపై ఇబ్బందిపెట్టే మొటిమలను నివారించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఇది బాక్టీరియాను చంపడానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, క్రిమినాశక తత్వాలను కలిగి ఉంటుంది. అలాగే వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్‌ సమ్మేళనాలు పొడిబారేందుకు ఏజెంట్‌ వలె పనిచేస్తాయి. క్రమంగా మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది.
- వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి. మొటిమలు మీద రాసి 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత నీటితో శుభ్రపరచండి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
- గుడ్డులోని తెల్లసొనలో చర్మం మీద మతకణాలను తొలగించడంలో, క్రమంగా రంధ్రాలను పూడ్చడంలో సహాయపడే ప్రోటీన్లు, పోషకాలతో నిండి ఉంటాయి. ఒక గిన్నెలో, గుడ్డు నుండి తెల్ల సొనను వేరు చేసి తీసుకోండి. వెల్లుల్లి పేస్ట్‌, తెల్ల గుడ్డు సొన మిశ్రమంలా కలపండి. మొటిమలు ఉన్నచోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.. ఎండిపోయే వరకు అలాగే వదిలివేయండి. పూర్తిగా పొడిబారాక సాధారణ నీటితో కడిగివేయండి.
- వెల్లుల్లి రెబ్బలను మిక్స్‌ చేసి అందులో వెనిగర్‌ కలిపి, మిశ్రమంగా పేస్టులా వచ్చే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. ఈ మిశ్రమాన్ని ఒక కాటన్‌ బాల్‌తో అప్లై చేసుకోవచ్చు. అది పూర్తిగా ఆరిపోయే వరకు వదిలేయండి. తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేయండి. మంచి ఫలితం కోసం ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.

మొటిమల నివారణకు...

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

కాంతులీనే చర్మానికి

17-11-2020

అర టీస్పూన్‌ పసుపు, నాలుగు టీస్పూన్ల పాలను ఓ గిన్నెలో కలపండి. దీన్ని ముఖం, మెడ చుట్టూ రాసుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా

manavi

అందం

ఇలా కాపాడుకోండి...

12-11-2020

ఈ రోజుల్లో జుట్టు రాలడం అన్నది సాధారణ సమస్య. తీసుకునే ఆహారం, వర్క్‌ టెన్షన్లు, విశ్రాంతి లేకపోవడం ఇలా ఎన్నో కారణాలు జుట్టు ఊడిపోయేలా

manavi

అందం

పెసలతో ఫేస్‌ప్యాక్‌

10-11-2020

పెసలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలుసు. అందుకే ఈ రోజుల్లో వాటిని మొలకలుగా చేసుకొని అంతా తింటున్నారు. అయితే పెసలుతో చర్మానికి

manavi

అందం

జుట్టు మెరవాలంటే?

24-10-2020

జుట్టు త్వరగా ఆరాలని చాలామంది బ్లో డ్రైయర్‌, హట్‌ రోలర్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల జుట్టు పెళుసుగా మారుతుంది. వీటిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడండి. అదేపనిగా వాడితే జుట్టు పొడిబారిపోయి

manavi

అందం

చర్మ సంరక్షణ కొరకు...

12-10-2020

ఆరోగ్యకరమైన పనితీరు కోసం మీరు శరీరానికి ఆహారం అందించినట్లే, మీ చర్మం కోసం కూడా అదే చేయవలసి ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, కూరగాయలు, పండ్లు సమృద్ధిగా ఉన్నాయో లేవో

manavi

అందం

సహజ సిద్ధంగా...

08-10-2020

ఓ బౌల్‌లో కొద్దిగా బొప్పాయి పండు గుజ్జు తీసుకోవాలి. ఇందులో ముల్తానీ మట్టిని కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి ఈ ప్యాక్‌ ఆరుతు న్నట్లుగా అనిపించినప్పుడు కొన్ని నీళ్లు చల్లుకుని మర్దనా చేస్తూ ప్యాక్‌ని తొలగించాలి. కొంతమందికి ముల్తానీ

manavi

అందం

సహజ మెరుపుకు...

06-10-2020

పెరుగు తినడానికి మాత్రమే కాదు.. పలు రకాల చర్మ సమస్యలను పరిష్కరించడంలోనూ ఓ మ్యాజిక్‌లా పనిచేస్తుంది. మీ ముఖ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవాలంటే ఓ సారి పెరుగు ఫేస్‌ ప్యాక్‌ను ట్రై చేయండి.

manavi

అందం

రోజా రేకులతో...

06-10-2020

చూడగానే ఎంతో అందంగా కన్పించే రోజా పూలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. శరీరంపై మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రోజా రేకుల ముద్దను రాసుకుంటే

manavi

అందం

సహజ మెరుపుకు...

04-10-2020

పెరుగు తినడానికి మాత్రమే కాదు.. పలు రకాల చర్మ సమస్యలను పరిష్కరించడంలోనూ ఓ మ్యాజిక్‌లా పనిచేస్తుంది. మీ ముఖ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవాలంటే ఓ సారి పెరుగు ఫేస్‌ ప్యాక్‌ను ట్రై