మీ చర్మతత్వాన్ని బట్టి... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

మీ చర్మతత్వాన్ని బట్టి...

ముఖం ఆరోగ్యంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్‌లు తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి మీ చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో చూడండి.
జిడ్డు చర్మం: బొప్పాయి, వేప, ముల్తాన్‌ మట్టి, కచ్చుర్‌ సుగంధీ పౌడర్‌ను రోజువాటర్‌తో మిక్స్‌ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు పోతుంది, మొటిమలు తగ్గుతాయి.
పొడి చర్మం: గులాబి, చందనం, అల్మండ్‌ పౌడర్‌లు, పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మెల్లగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంలో పొడితనం పోయి, ముఖం కాంతివంతమవుతుంది.
- బొప్పాయి, కచ్చుర్‌ సుగంధీ పౌడర్‌, ముల్తాన్‌ మట్టి, ఛాయపసుపు, గులాబీ పౌడర్‌లను రోజ్‌వాటర్‌లో వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగితే మొటిమల మచ్చలు తగ్గుతాయి. అయితే ఇలా వారానికి మూడు సార్లు తప్పనిసరిగా చేస్తేనే ఫలితం ఉంటుంది.
కండ్ల కింద నలుపు: గులాబీ రేకులపొడి, బొప్పాయి, పుదీనా పొడుల్లో, రెండు చుక్కల చందనం నూనె, అలోవీరా జెల్‌ని కలిపి కంటి చుట్టూ రాయాలి. ఓ పదినిమిషాల పాటు మెల్లిగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి..
- రోజ్‌వాటర్‌లో చందనం, గులాబి, ఛాయపసుపు, దోసకాయ రసం, బొప్పాయి పొడి, ముల్తాన్‌ మట్టి కలిపి ముఖానికి రాయాలి. అరగంట ఆగి, గోరు నీటితో కడిగేయాలి. 

మీ చర్మతత్వాన్ని బట్టి...

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

నిమ్మరసంతో క్లీన్‌

23-03-2021

కొద్దిగా నిమ్మరసం, ఓ టీ స్పూన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఉడికించి ముద్ద చేసుకున్న క్యాబేజ్‌ తీసుకోవాలి. కొద్దిగా నిమ్మ రసాన్ని ఉడికించి క్రష్‌ చేసుకున్న క్యాబేజీలో

manavi

అందం

తళుక్కుమనే గోళ్ళకోసం...

09-03-2021

అమ్మాయిలు వేసుకునే బట్టల దగ్గర నుండి బ్యాగులు, చెప్పులు, ఇయర్‌ రింగ్స్‌ వంటి వాటి వరకు కొత్తగా ఉండాలని కోరుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వారి

manavi

అందం

నల్లని జుట్టు కోసం...

25-02-2021

జుట్టు నల్లగా నిగనిగ లాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్‌లోపం లేకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ,

manavi

అందం

చర్మ సంరక్షణకు...

22-02-2021

శీతా కాలం నుంచి వసంత రుతువులోకి అడుగిడుతున్న తరుణమిది. చలి గాలులతో ఇబ్బంది పెట్టిన శీతా కాలాన్ని దూరం చేసుకొని అందమైన వసంతంలోకి అడుగుపెడుతున్నాం. కానీ

manavi

అందం

గుడ్డుతో మెరిసిపోండి

16-02-2021

గుడ్డును ఏరూపంలో తిన్నా, ముఖానికి ప్యాక్‌లా వేసుకున్నా చక్కని ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా తెల్లసొనలో ప్రొటీన్‌ ఉండడం వల్ల దాన్ని ముఖానికి, జుట్టుకు పట్టిస్తే అందాన్ని రెట్టింపు చేస్తుంది.

manavi

అందం

చర్మం మెరిసిపోతుంది

15-02-2021

కొద్దిగా నిమ్మరసం, పంచదార, తేనె కలిపి చర్మానికి పట్టించండి. పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. చర్మం మెరవాలంటే వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. రోజూ ఎక్కువగా నీరు తాగేవారి స్కిన్‌ గ్లో

manavi

అందం

ఒత్తైన కురుల కోసం...

20-01-2021

మందార పువ్వులతో హెయిర్‌ ప్యాక్‌ వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనీ.. జుట్టు రాలే సమస్యలుండవని బ్యూటీషియన్లు అంటున్నారు. మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును

manavi

అందం

ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?

19-01-2021

ముఖం కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో తెలుసుకుందాం...

manavi

అందం

బియ్యం పిండి చాలు...

14-01-2021

రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యం పిండిలో అదే పరిమాణంలో టీ డికాక్షన్‌, టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో