చర్మ సంరక్షణకు... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

చర్మ సంరక్షణకు...

శీతా కాలం నుంచి వసంత రుతువులోకి అడుగిడుతున్న తరుణమిది. చలి గాలులతో ఇబ్బంది పెట్టిన శీతా కాలాన్ని దూరం చేసుకొని అందమైన వసంతంలోకి అడుగుపెడుతున్నాం. కానీ వసంత రుతువులో మన చుట్టూ ఉన్న ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోతే మన చర్మం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అటు చలి కాలం, ఇటు ఎండా కాలం రెండు కాలాలకు మధ్య వచ్చే సమస్యలతో చర్మం ఇబ్బంది పడుతుంది. అందుకే ఈ సమయంలో చర్మ సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. అందుకే ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి.
హైడ్రేషన్‌పై దృష్టి పెట్టండి: ఈ కాలంలో చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మన చర్మంలో తేమ శాతం తగ్గుతూ ఉంటుంది. కనుక మన శరీర కణాలను ఎప్పటికప్పుడు తేమను నిలుపుకునేలా తయారుచేయాలి. రోజూ మాయిశ్చరైజర్‌ తప్పకుండా ఉపయోగించడం, టోనింగ్‌ చేయడం, నీటిని ఎక్కువగా తాగడం వంటివి చేస్తుండాలి.
మాయిశ్చరైజర్‌ మార్చాలి: శీతాకాలంలో ఉన్నట్లు మీ ముఖ చర్మం మరీ అంతగా పొడిబారినట్టు ఉండదు గనుక మీరు వాడుతున్న ఫేస్‌ క్రీములనే కొనసాగించవచ్చు. అయితే ఈ కాలంలో జిడ్డు ఎక్కువగా ఉన్న మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. అందుకే తేలికైన, చర్మంలోకి సులువుగా పీల్చుకోగలిగిన వాటర్‌ బేస్డ్‌ మాయిశ్చరైజర్‌ ఉపయోగించాలి.
మృత చర్మాన్ని తొలగించాలి: స్క్రబింగ్‌ మరీ ఎక్కువగా చేయడం వల్ల చర్మం పాడవుతుంది. మనం వాడే ఎలాంటి ఉత్పత్తులైనా మృత చర్మాన్ని మాత్రమే తొలగించే విధంగా ఉండాలి తప్ప అధిక మోతాదులో దేన్ని వినియోగించినా దుష్పలితాలు ఎదురవుతాయని మరిచిపోకూడదు. అందుకే కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే స్క్రబ్‌ చేయాలి. వసంత రుతువులో చెమట పట్టడం ఎక్కువగానే ఉంటుంది. చర్మంపై దుమ్ము, మృత కణాలతో ఇది కలిసి మొటిమలు వచ్చేలా చేస్తుంది. అందుకే జిడ్డు చర్మం ఉన్నవారు తరచూ చన్నీటితో ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. అయితే ఇందు కోసం ఎలాంటి ఉత్పత్తులనూ ఉపయోగించకూడదు. రోజుకు రెండు సార్లు మాత్రమే సబ్బుతో ముఖం కడుక్కోవాలి.

చర్మ సంరక్షణకు...

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

నిమ్మరసంతో క్లీన్‌

23-03-2021

కొద్దిగా నిమ్మరసం, ఓ టీ స్పూన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఉడికించి ముద్ద చేసుకున్న క్యాబేజ్‌ తీసుకోవాలి. కొద్దిగా నిమ్మ రసాన్ని ఉడికించి క్రష్‌ చేసుకున్న క్యాబేజీలో

manavi

అందం

తళుక్కుమనే గోళ్ళకోసం...

09-03-2021

అమ్మాయిలు వేసుకునే బట్టల దగ్గర నుండి బ్యాగులు, చెప్పులు, ఇయర్‌ రింగ్స్‌ వంటి వాటి వరకు కొత్తగా ఉండాలని కోరుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వారి

manavi

అందం

నల్లని జుట్టు కోసం...

25-02-2021

జుట్టు నల్లగా నిగనిగ లాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్‌లోపం లేకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ,

manavi

అందం

మీ చర్మతత్వాన్ని బట్టి...

18-02-2021

ముఖం ఆరోగ్యంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్‌లు తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి మీ చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ

manavi

అందం

గుడ్డుతో మెరిసిపోండి

16-02-2021

గుడ్డును ఏరూపంలో తిన్నా, ముఖానికి ప్యాక్‌లా వేసుకున్నా చక్కని ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా తెల్లసొనలో ప్రొటీన్‌ ఉండడం వల్ల దాన్ని ముఖానికి, జుట్టుకు పట్టిస్తే అందాన్ని రెట్టింపు చేస్తుంది.

manavi

అందం

చర్మం మెరిసిపోతుంది

15-02-2021

కొద్దిగా నిమ్మరసం, పంచదార, తేనె కలిపి చర్మానికి పట్టించండి. పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. చర్మం మెరవాలంటే వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. రోజూ ఎక్కువగా నీరు తాగేవారి స్కిన్‌ గ్లో

manavi

అందం

ఒత్తైన కురుల కోసం...

20-01-2021

మందార పువ్వులతో హెయిర్‌ ప్యాక్‌ వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనీ.. జుట్టు రాలే సమస్యలుండవని బ్యూటీషియన్లు అంటున్నారు. మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును

manavi

అందం

ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?

19-01-2021

ముఖం కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో తెలుసుకుందాం...

manavi

అందం

బియ్యం పిండి చాలు...

14-01-2021

రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యం పిండిలో అదే పరిమాణంలో టీ డికాక్షన్‌, టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో