నల్లని జుట్టు కోసం... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

నల్లని జుట్టు కోసం...

జుట్టు నల్లగా నిగనిగ లాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్‌లోపం లేకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ, తృణధాన్యాలూ, గుడ్లూ, మాంసాహారం ఎక్కువగా తింటే 'బి' విటమిన్‌ బాగా అందుతుంది.
- 'సిలికా' అనే ఖనిజ లవణం జుట్టుకు తేమను అందించి, వెంట్రుకల్ని దృఢంగా ఉంచుతుంది. యాపిల్స్‌, కమలాలు, ఎండుద్రాక్ష, ఉల్లిగడ్డ, క్యారెట్లు, ఓట్స్‌, శుద్ధిచేయని గింజలు, పప్పులు, గింజలు, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ సిలికాను అందిస్తాయి.
- కేశాలు చిట్లిపోయి, ఎదుగుదల తక్కువగా ఉంటే మాంసకృత్తులు లోపించినట్టని అర్థం. ఎందుకంటే జుట్టు కణాలు పరిణతి చెందాక వాటిల్లో కెరొటిన్‌ అనే ప్రొటీన్‌ నిండుతుంది. దీనివల్లే జుట్టు ఎదుగుదల బాగుంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువుండే లోఫ్యాట్‌ చీజ్‌, బీన్స్‌, గుడ్లు, పాలు, పెరుగు, సోయాపాలు, నట్స్‌, గింజలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
- తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే జింక్‌ లోపం ఉండొచ్చని సందేహించాలి. జింక్‌ జుట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. నువ్వులూ, గుమ్మడి గింజలూ, పుచ్చకాయ గింజలూ, డార్క్‌ చాక్లెట్‌, పల్లీలు లాంటి వాటిల్లో జింక్‌ పుష్కలంగా లభిస్తుంది.
- చుండ్రు వుంటే తలంతా దురద పుట్టి, పొట్టుగా రాలుతుంది. తలలో సహజ నూనెలు తగ్గి పొడిబారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుంది.దాన్ని తగ్గించుకోవాలంటే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పోషకాలను నట్స్‌, సాల్మన్‌ తరహా చేపలు, అవిసె గింజలు, గుడ్ల నుంచి పొందవచ్చు. 

నల్లని జుట్టు కోసం...

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

నిమ్మరసంతో క్లీన్‌

23-03-2021

కొద్దిగా నిమ్మరసం, ఓ టీ స్పూన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఉడికించి ముద్ద చేసుకున్న క్యాబేజ్‌ తీసుకోవాలి. కొద్దిగా నిమ్మ రసాన్ని ఉడికించి క్రష్‌ చేసుకున్న క్యాబేజీలో

manavi

అందం

తళుక్కుమనే గోళ్ళకోసం...

09-03-2021

అమ్మాయిలు వేసుకునే బట్టల దగ్గర నుండి బ్యాగులు, చెప్పులు, ఇయర్‌ రింగ్స్‌ వంటి వాటి వరకు కొత్తగా ఉండాలని కోరుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వారి

manavi

అందం

చర్మ సంరక్షణకు...

22-02-2021

శీతా కాలం నుంచి వసంత రుతువులోకి అడుగిడుతున్న తరుణమిది. చలి గాలులతో ఇబ్బంది పెట్టిన శీతా కాలాన్ని దూరం చేసుకొని అందమైన వసంతంలోకి అడుగుపెడుతున్నాం. కానీ

manavi

అందం

మీ చర్మతత్వాన్ని బట్టి...

18-02-2021

ముఖం ఆరోగ్యంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్‌లు తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి మీ చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ

manavi

అందం

గుడ్డుతో మెరిసిపోండి

16-02-2021

గుడ్డును ఏరూపంలో తిన్నా, ముఖానికి ప్యాక్‌లా వేసుకున్నా చక్కని ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా తెల్లసొనలో ప్రొటీన్‌ ఉండడం వల్ల దాన్ని ముఖానికి, జుట్టుకు పట్టిస్తే అందాన్ని రెట్టింపు చేస్తుంది.

manavi

అందం

చర్మం మెరిసిపోతుంది

15-02-2021

కొద్దిగా నిమ్మరసం, పంచదార, తేనె కలిపి చర్మానికి పట్టించండి. పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. చర్మం మెరవాలంటే వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. రోజూ ఎక్కువగా నీరు తాగేవారి స్కిన్‌ గ్లో

manavi

అందం

ఒత్తైన కురుల కోసం...

20-01-2021

మందార పువ్వులతో హెయిర్‌ ప్యాక్‌ వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనీ.. జుట్టు రాలే సమస్యలుండవని బ్యూటీషియన్లు అంటున్నారు. మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును

manavi

అందం

ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?

19-01-2021

ముఖం కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో తెలుసుకుందాం...

manavi

అందం

బియ్యం పిండి చాలు...

14-01-2021

రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యం పిండిలో అదే పరిమాణంలో టీ డికాక్షన్‌, టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో