పొడిచర్మానికి పొందికగా.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

పొడిచర్మానికి పొందికగా..

పొడి చర్మం ఉన్నవాళ్లు స్నానం చేయగానే చర్మం బిగుసుకుపోయినట్టు అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు...
- కొన్ని చుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ లేదా సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ వేసిన పచ్చిపాలల్లో దూది ముంచి చర్మాన్ని శుభ్రం చేయాలి. తరువాత చల్లని నీటితో చర్మాన్ని కడుక్కోవాలి.
- తేనె సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌. తేనెలో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసుకొని చర్మానికి రాసుకోవాలి. పావుగంట తరువాత కడుక్కుంటే చర్మం సున్నితంగా ఉండడమే కాకుండా పొడి బారడం తగ్గుతుంది.
- ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు.
- స్నానం చేయగానే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. పొడిచర్మానికి క్రీమీగా ఉండే మాయిశ్చరైజర్‌ అయితే బాగా పనిచేస్తుంది.
- స్నానానికి వెళ్లే ముందు ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనెతో చర్మాన్ని మర్దనా చేసుకోవాలి. ఇలా మర్దనా చేసుకున్న తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
- కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ వేసిన నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది.
- చిటికెడు పసుపు కలిపిన పాల మీగడను ప్రతిరోజూ ముఖానికి రాసుకోవాలి. తరువాత ముఖాన్ని శెనగపిండి లేదా సున్నిపిండితో కడుక్కోవాలి.
- రాత్రి పూట నానబెట్టిన 4లేదా5 బాదం గింజల్ని పొద్దున్నే తొక్క వలిచి మెత్తగా చేసుకోవాలి. అందులో కొన్ని పచ్చిపాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15నిమిషాల తరువాత కడుక్కోవాలి. చర్మ ఆరోగ్యానికి బాదం మంచి ఔషధంలా పనిచేస్తుంది.
- గుడ్డు పచ్చసొన, మీగడ, రోజ్‌ వాటర్‌లను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని కొంత సమయం తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడాన్ని త్వరగా అరికట్టవచ్చు.
- తక్కువ నీటితో క్యారెట్‌ని ఉడికించి, అది చల్లారిన తరువాత మెత్తగా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. సున్నితమైన పొడి చర్మానికి బాగా పనిచేస్తుంది.
- ఔషధగుణాలున్న కలబందని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం చల్లబడుతుది.. కూలెంట్‌లా పనిచేసే కలబంద గుజ్జులో, కొద్దిగాపసుపును కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా, కాంతి వంతంగా తయారవుతుంది.

పొడిచర్మానికి పొందికగా..

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

సౌందర్యానికి తేనె

19-07-2019

దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది.

manavi

అందం

మృదువైన జట్టుకు..

16-07-2019

జుట్టు పట్టుకుంటే పట్టుకుచ్చులా చేతివేళ్ల నుంచి జారిపోవాలి. పూసలు గుచ్చేటంత బలంగా వెంట్రుక కుదురు ఉండాలి. సహజమైన రంగుతో కురులు ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండాలి.

manavi

అందం

ముఖవర్చస్సుకి లెమన్‌ ఫేస్‌ప్యాక్‌

13-07-2019

ముఖంపై ఉండే మచ్చలతో పాటు ఇతర రకాల సమస్యల్ని పోగొట్టు కోవడానికి చాలామంది రకరకాల ఫేస్‌క్రీమ్స్‌ని ఆశ్రయిస్తారు. అయితే ముఖం మెరిసిపోవడానికి నిమ్మకాయ, బేకింగ్‌సోడాలో మంచి

manavi

అందం

మెరిసే మోముకి...

11-07-2019

బీట్‌రూట్‌ని తీసుకుని బాగా ఉడకబెట్టాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసి, రెండు చెంచాల పాలూ, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసుకుని అరగంట పాటు వదిలేయాలి. ఆరాక మంచినీళ్లతో కడిగేసుకోవాలి.

manavi

అందం

సంతోషాన్ని పంచుతూ...

09-07-2019

సంతోషం అంటే ఏమిటి? దానికి కొలమానాలేమిటి? అసలు సంతోషంగా ఉండటం ఎట్లా? ఎన్నో ప్రశ్నలు. సంతోషం ఎక్కడో ఉండది. మనలోనే ఉంటుంది. మనతోనే ఉంటుంది. అది చాలా

manavi

అందం

స్లీవ్‌లెస్‌ ధరిస్తున్నారా?

05-07-2019

టీనేజ్‌ అమ్మాయిలు, ఉద్యోగులు ఎక్కువగా ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నవాటిల్లో స్లీవ్‌లెస్‌ ఒకటి. సందర్భాన్ని బట్టి చీర, జీన్స్‌ మొదలు పలు వస్త్రధారణలకు టాప్‌గా

manavi

అందం

వానల్లో జుట్టు సంరక్షణ

04-07-2019

ఈ రోజుల్లో వాన జల్లుల్లో తడవటం సహజమే. ఇలా తడిసిన ప్రతిసారీ ఆ ప్రభావం జుట్టు మీద ఖచ్చితంగా పడుతుంది. దీంతో పట్టుకుచ్చులాంటి జుట్టు కళతప్పి వెలవెలబోతుంది. అందుకే

manavi

అందం

హైహీల్స్‌తో అనారోగ్యం

03-07-2019

రోజురోజుకు హైహీల్స్‌ వాడుతున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉండేవారు వీటిని ఎక్కువగా వాడుతున్నారు.అయితే వీరిలో చాలామంది శరీర

manavi

అందం

ఓట్స్‌తో బ్లాక్‌హెడ్స్‌ మాయం..!

02-07-2019

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ