ఓవర్‌ మేకప్‌ మంచిదికాదు! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

ఓవర్‌ మేకప్‌ మంచిదికాదు!

మేకప్‌ వేసుకోవడమనేది ఈరోజుల్లో సాధారణమైపోయింది. అయితే ఏదో ఒకటి అని కాకుండా.. మేకప్‌ చేసుకోవడానికి మీ శరీర ఛాయకు తగిన కాస్మోటిక్స్‌ను ఎంచుకోవాలి. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
మేకప్‌కు కావలసింది ముఖ్యంగా చర్మానికి పునాదిగా వేసే మేకప్‌ పౌడర్‌. ఆ తరువాత పై పూతకి రంగు క్రీం, పౌడర్లు, కంటికి వాడే పెన్సిళ్ళు, షేడ్స్‌, మీ పెదాలకు వాడే లిప్‌స్టిక్స్‌, ఇవన్నీ మ్యాచ్‌ అయ్యే విధంగా చూసుకోవాలి. మీ కంటివెంబడి చారలని నలుపు పెన్సిళ్ళతో సరిదిద్దుకోవాలి.
మీ మేకప్‌ కిట్‌లో మీరు మీ ముఖాన్ని శుభ్రపరచుకోవడానికి క్లీనర్స్‌ను కూడా ఉంచుకోవాలి. టోనింగ్‌ నిమిత్తం టోనర్స్‌ ఉంచుకోవాలి. మీ స్కిన్‌ ఆయిల్‌ స్కిన్‌ అయితే ఆయిల్‌ ఫ్రీ రంగులను వాడాలి. అదే డ్రై స్కిన్‌ అయితే 'ఆయిల్‌ కలర్స్‌'తో కూడిన రంగులనే వాడాలి. కాంబినేషన్‌ స్కిన్‌కు వాటర్‌ బేస్‌ పిగ్మెంట్‌ ఉన్న రంగునే ఉపయోగించాలి. చర్మం ముడతలు పడితే హెచ్చుగా లేదా ముదురుగా ఫౌండేషన్‌ను వాడకూడదు. అలాగే హెచ్చుగా ముదురైన పౌడర్లను ఉపయోగించకూడదు. దీంతో మొహం మీద గీతలు స్పష్టంగా కనిపిస్తాయి.
మనం మేకప్‌ ప్రారంభించేముందు ముఖం మీద రెండువైపుల నుండి తగినంత వెలుతురు పడే విధంగా చూసుకోవాలి. మేకప్‌కు ముందు ముఖాన్ని, మెడని మంచి నీళ్ళతో శుభ్రపరచుకోవాలి. డ్రై స్కిన్‌వారు స్కిన్‌టోనర్‌ వాడాలి. దాంతో చర్మం నార్మల్‌ స్థితికి వస్తుంది. చర్మం పొడిగా ఉన్నప్పుడు ఫౌండేషన్‌ క్రింద మాయిశ్చరైజర్‌ను ఉపయోగిస్తే మంచిది.
ముఖం మీద నల్లటి మచ్చలు గాని, చారలు గాని ఉంటే మీ చర్మం రంగు కన్నా పలచటి రంగును తీసుకుని వాటిమీద రాయండి. మీ వేళ్ళతో మెల్లగా రుద్దండి. మచ్చలు మాయమవుతాయి. ఏదేమైనా మనం వేసుకునే మేకప్‌ రియాలిటీకి దగ్గరగా ఉంటే మంచిది. దానివలన మీకు చక్కటి అందం సమకూరుతుంది.

ఓవర్‌ మేకప్‌ మంచిదికాదు!

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

మెరిపించే నెయిల్‌ఆర్ట్‌

12-12-2019

ఇప్పుడు నెయిల్‌ ఆర్ట్‌ ఫ్యాషన్‌కు క్రేజ్‌ ఉంది. ఇంతకుముందువరకు మహిళలు గోళ్ళకు నెయిల్‌ పాలిష్‌, గోరింటాకు మాత్రమే పెట్టుకునేవారు. కాని ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్‌ వల్ల గోళ్ళపై విభిన్నమైన చిత్రాలను చిత్రీకరించుకోవచ్చు.

manavi

అందం

అందాన్ని పెంచే గుడ్డు

11-12-2019

ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎంతగా ఉపయోగపడుతుందో సౌందర్య పోషణలోనూ అంతే పనికొస్తుంది. చర్మ సౌందర్యానికి గుడ్డు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

manavi

అందం

అందానికి ద్రాక్ష

06-12-2019

రుచికి తియ్యతియ్యగా, పుల్లపుల్లగా అనిపించే ద్రాక్ష పండ్లు సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడతాయి. ద్రాక్షలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సరికొత్త మెరుపును తీసుకొస్తాయి. ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు

manavi

అందం

పెళ్లిలో మెరవాలంటే..

05-12-2019

సహజంగానే అందం విషయంలో శ్రద్ధ చూపే అమ్మయిలు పెళ్లి అనగానే సౌందర్య పరిరక్షణ గురించి మరికాస్త ఆలోచనలో పడుతుంటారు. కాబోయే పెళ్లి కూతుళ్ళంతా కనీసం నెల ముందు నుంచైనా సౌందర్య పరి రక్షణ మీద దష్టి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

manavi

అందం

కలువ కళ్లకు కాటుక

03-12-2019

ఎంత చిన్న కళ్ళైనా రవ్వంత కాటుకతో అలంకరిస్తే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. కాటుక కళ్లు పలికే భావాలు ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతాయి. కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమే గాక కళ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది. కాటుక

manavi

అందం

ట్రెండీగా కనిపించాలంటే...

01-12-2019

కాలానికి అనుగుణంగా ఫ్యాషన్‌ మారుతూ ఉంటుంది. కానీ, ఏ సీజన్‌లోనైనా ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకుంటే వార్డ్‌రోబ్‌లో కొన్ని రకాల దుస్తులను జత చేయాల్సిందే. వాటి గురించి తెలుసుకుందాం.

manavi

అందం

అగ్నితీగ

30-11-2019

ఆరెంజ్‌ ట్రంపెట్‌ క్రొపర్‌ చాలా తేలికగా పేంచ గలిగే మొక్క. డిసెంబర్‌ జనవరి నెలల్లో అగ్ని వంటి ప్రకాశమైన నారింజ రంగు పువ్వులతో నిలువెల్లా పూస్తుంది. దీని శాస్రీయ నామం బిగ్నానియా

manavi

అందం

టమాటతో అందం

28-11-2019

- రెండు చెంచాల టమాట గుజ్జు, చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మపు ఛాయ మెరుగుపడటమే గాక చర్మానికి తగినంత తేమ అందుతుంది.

manavi

అందం

ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్‌ మాయం!

27-11-2019

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్‌ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత

manavi

అందం

సహజ రంగులే బెటర్‌

23-11-2019

బీట్‌ రూట్‌ మంచి రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది. బీట్‌ రూట్‌ ను మిక్సీలో మెత్తని పేస్టుగా మార్చాలి. ఆ పేస్టుని నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారక నీటిని వడకట్టాలి. ఆ నీటిని మాడుకి,