మెరిసే కళ్లకు... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

మెరిసే కళ్లకు...

ప్రతి ఒక్కరిలోనూ ఆకర్షణీయమైనవి, అందాన్ని మరింత పెంచేవి కళ్ళు. అందంగా కనిపించేందుకు ముఖానికి మేకప్‌ వేసుకోవడం, పెదవులకు లిప్స్టిక్‌ అప్లై చేసుకోవడం ఇలా సాధారణంగా అందరూ చేస్తున్నవే. అయితే కనుబొమ్మలు, కనురెప్పల గురించి చాలా తక్కువమందే పట్టించుకుంటూ ఉంటారు. అందుకే, ఇక్కడ మీ కనుబొమ్మలు, కనురెప్పల అందాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలో చూడండి..
ఆముదం, కొబ్బరినూనె: ఒకటి లేదా రెండు చుక్కల ఆముదంలో మరో చుక్క కొబ్బరినూనె కలిపి మిక్స్‌ చేయాలి. ఇందులో కాటన్‌ లేదా బ్రష్‌ ఉంచి, కనురెప్పలు, కనుబొమ్మలపై అప్లై చేసుకుని పడుకోవాలి. ఉదయాన్నే కాస్త గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వలన కనురెప్పలు సురక్షితంగా, అందంగా ఉంటాయి. అలాగే వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి. కొబ్బరినూనె అవసరం లేకుండా ఆముదం అయినా రాసుకోవచ్చు. ఇక ఆముదంకు బదులుగా రోజ్‌ మేరీ ఆయిల్‌, టీ ట్రీ ఆయిల్‌, ఆలివ్‌ ఆయిల్‌, ఆల్మండ్‌ ఆయిల్‌ ఉపయోగించవచ్చు. ప్రతిరోజు రాత్రి పడుకునేముందు ఇలా చేస్తే సరిపోతుంది.
అలోవెరా జెల్‌: అలోవెరా జెల్‌ వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇంటి పరిసరాలలో ఈ మొక్క ఉండాలని మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. కనురెప్పలు అందంగా ఉండేందుకు, కనురెప్పల వెంట్రుకలు బాగా ఆకర్షణీయంగా కనిపించేందుకు కాస్త తాజా అలోవెరా జెల్‌ తీసుకుని కనురెప్పలపై రాసుకోవాలి. ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా సులభమైనది. మీ కనురెప్పలు అందంగా కనిపించేందుకు బాగా ఉపయోగపడుతుంది.
వాజిలిన్‌ లేదా పెట్రోలియం జెల్లీ: కాస్త పెట్రోలియం జెల్లీని తీసుకుని కనురెప్పలు, కనుబొమ్మలపై రాసుకుని నిద్రించాలి. ఇది కనురెప్పలపై రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉదయాన్నే చల్లని నీటితో కనురెప్పల వెంట్రుకలపై పెట్రోలియం జెల్లీ లేకుండా బాగా క్లీన్‌ చేసుకోవాలి. ఇది కనురెప్పల వెంట్రుకలు అందంగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
మెంతి నూనె: ఒక స్పూన్‌ మెంతి నూనెలో రెండు లేదా మూడు చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ మిక్స్‌ చేసుకుని అందులో కాటన్‌ ఉంచి కనురెప్పలపై మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వలన కనురెప్పలు అందంగా ఉండటంతో పాటు ఒత్తుగా పెరుగుతాయి. ఉదయాన్నే బాగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
నిమ్మ తొక్కలు: నిమ్మతొక్కలను చిన్నగా కట్‌ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మూడు స్పూన్లు ఆలివ్‌ ఆయిల్‌ లేదా ఆముదం తీసుకోవాలి. ఇందులో నిమ్మతొక్కలు వేసి రెండు రోజుల పాటు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని రెండు రోజుల తర్వాత కనురెప్పలపై అప్లై చేసుకుని నిద్రించి, ఉదయాన్నే నీటితో బాగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కనురెప్పలు అందంగా ఉంటాయి. 

మెరిసే కళ్లకు...

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

మెరిపించే నెయిల్‌ఆర్ట్‌

12-12-2019

ఇప్పుడు నెయిల్‌ ఆర్ట్‌ ఫ్యాషన్‌కు క్రేజ్‌ ఉంది. ఇంతకుముందువరకు మహిళలు గోళ్ళకు నెయిల్‌ పాలిష్‌, గోరింటాకు మాత్రమే పెట్టుకునేవారు. కాని ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్‌ వల్ల గోళ్ళపై విభిన్నమైన చిత్రాలను చిత్రీకరించుకోవచ్చు.

manavi

అందం

అందాన్ని పెంచే గుడ్డు

11-12-2019

ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎంతగా ఉపయోగపడుతుందో సౌందర్య పోషణలోనూ అంతే పనికొస్తుంది. చర్మ సౌందర్యానికి గుడ్డు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

manavi

అందం

అందానికి ద్రాక్ష

06-12-2019

రుచికి తియ్యతియ్యగా, పుల్లపుల్లగా అనిపించే ద్రాక్ష పండ్లు సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడతాయి. ద్రాక్షలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సరికొత్త మెరుపును తీసుకొస్తాయి. ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు

manavi

అందం

పెళ్లిలో మెరవాలంటే..

05-12-2019

సహజంగానే అందం విషయంలో శ్రద్ధ చూపే అమ్మయిలు పెళ్లి అనగానే సౌందర్య పరిరక్షణ గురించి మరికాస్త ఆలోచనలో పడుతుంటారు. కాబోయే పెళ్లి కూతుళ్ళంతా కనీసం నెల ముందు నుంచైనా సౌందర్య పరి రక్షణ మీద దష్టి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

manavi

అందం

కలువ కళ్లకు కాటుక

03-12-2019

ఎంత చిన్న కళ్ళైనా రవ్వంత కాటుకతో అలంకరిస్తే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. కాటుక కళ్లు పలికే భావాలు ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతాయి. కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమే గాక కళ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది. కాటుక

manavi

అందం

ట్రెండీగా కనిపించాలంటే...

01-12-2019

కాలానికి అనుగుణంగా ఫ్యాషన్‌ మారుతూ ఉంటుంది. కానీ, ఏ సీజన్‌లోనైనా ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకుంటే వార్డ్‌రోబ్‌లో కొన్ని రకాల దుస్తులను జత చేయాల్సిందే. వాటి గురించి తెలుసుకుందాం.

manavi

అందం

అగ్నితీగ

30-11-2019

ఆరెంజ్‌ ట్రంపెట్‌ క్రొపర్‌ చాలా తేలికగా పేంచ గలిగే మొక్క. డిసెంబర్‌ జనవరి నెలల్లో అగ్ని వంటి ప్రకాశమైన నారింజ రంగు పువ్వులతో నిలువెల్లా పూస్తుంది. దీని శాస్రీయ నామం బిగ్నానియా

manavi

అందం

టమాటతో అందం

28-11-2019

- రెండు చెంచాల టమాట గుజ్జు, చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మపు ఛాయ మెరుగుపడటమే గాక చర్మానికి తగినంత తేమ అందుతుంది.

manavi

అందం

ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్‌ మాయం!

27-11-2019

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్‌ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత

manavi

అందం

సహజ రంగులే బెటర్‌

23-11-2019

బీట్‌ రూట్‌ మంచి రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది. బీట్‌ రూట్‌ ను మిక్సీలో మెత్తని పేస్టుగా మార్చాలి. ఆ పేస్టుని నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారక నీటిని వడకట్టాలి. ఆ నీటిని మాడుకి,