అందానికి ద్రాక్ష | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

అందానికి ద్రాక్ష

రుచికి తియ్యతియ్యగా, పుల్లపుల్లగా అనిపించే ద్రాక్ష పండ్లు సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడతాయి. ద్రాక్షలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సరికొత్త మెరుపును తీసుకొస్తాయి. ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది.
- ద్రాక్షలోని పైటోకెమికల్స్‌ కణాల క్షీణతను తగ్గించటంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి వేస్తాయి. వయసుతో బాటు చర్మంలో వచ్చే మార్పులను ద్రాక్షలోని పోషకాలు ఆలస్యం చేసి నడివయసులోనూ యవ్వనపు శోభను నిలుపుతాయి.
- గుప్పెడు ద్రాక్షపళ్ళను అరచేతులతో బాగా నలిపి మెత్తని ముద్దగా చేసుకుని, దానికి చెంచా తేనె కలిపి, ఆ గుజ్జును ముఖానికీ మెడకీ బాగా పట్టించాలి. పావుగంట తర్వాత చన్నీటితో కడిగేసుకుంటే ముఖచర్మం మీద పేరుకున్న మురికి, జిడ్డు దూరమై చర్మం కోమలంగా మారి, మెరిసిపోతుంది.
- పొడి చర్మంతో బాధపడే వారు చెంచా చొప్పున గుడ్డు తెల్లసొన, ద్రాక్ష పండ్ల రసాన్ని కలిపి ముఖానికి బాగా పట్టించి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
- కళ్ల దిగువన నల్లని వలయాలు, ముడుతలు ఉన్నవారు ద్రాక్ష పండును అడ్డంగా కోసి దానితో కంటికింది ముడతలు, వలయాల మీద 3 నిమిషాలు రుద్దాలి. ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారం రోజులు చేస్తే కంటికింది చర్మం పలుచబడి ముడుతలు, మచ్చలు మాయం అవుతాయి.
- 3 చెంచాల ద్రాక్షరసం, 5 చెంచాల పెరుగు, చెంచా నారింజ రసం కలిపి ముఖాన్నీ మర్దన చేసి, చివరగా ప్యాక్‌ వేసుకోవాలి. ఇది వయసు ప్రభావం కనిపించనివ్వకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
- ద్రాక్షలకు మొటిమలూ, వాటి మచ్చల్నీ తగ్గించే గుణం ఉంది. ఆరు ద్రాక్ష పళ్లని మెత్తగా చేసి, దానికి పావు చెంచా గోధుమ పిండి, చిటికెడు బేకింగ్‌ సోడా కలిపి మొటిమలు లేదా వాటి మచ్చల మీద రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అందానికి ద్రాక్ష

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

తేజస్సు పెరిగేలా...

15-01-2020

ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం చాలా మందికి అలవాటు. ఒకవేళ ముఖం ఉబ్బరించి ఉంటే తెగ ఆందోళన పడతారు. అయితే ముఖంలో తగ్గిన తేజస్సుని కింద పేర్కొన్న ఈ సహజ విధానాల ద్వారా సులభంగా నివారించవచ్చు.

manavi

అందం

పొడి జుట్టుకు...

12-01-2020

చలికాలంలో మాడు భాగం దురద పెట్టడం, పొడిబారడం వంటి సమస్యలు వేధిస్తుం టాయి. ప్రొబయాటిక్స్‌ ఎక్కువగా తీసు కోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా ఈ సమస్యలు పరిష్కారమై, ఆరోగ్యకరమైన కురులు మీ సొంతమవుతాయి. కురుల సంరక్షణ కోసం చర్మ నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివి...

manavi

అందం

జుట్టు మెరిసేలా..

11-01-2020

పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టు అందానికి ప్రతీక. అయితే నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లు, తరచూ వాడే షాంపూలు, రంగుల వినియోగం వంటి కారణాల మూలంగా జుట్టు సహజ శోభను కోల్పోయి నిర్జీవంగా

manavi

అందం

అందాన్ని కాపాడే సులభమైన చిట్కాలు

08-01-2020

అందాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన చిట్కాల్లో మొదటిది.. సరిపడినంత నీటిని తాగడం. రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగడం ముఖ్యం. బ్యూటీ ప్రొడక్ట్స్‌ కొనడం కంటే వాటిని ఉపయోగించే విషయంలో శ్రద్ధ

manavi

అందం

మచ్చల్లేని చర్మం కోసం....

06-01-2020

మచ్చల్లేకుండా అందంగా, ప్రకాశవంతంగా చర్మం మెరిసిపోవాలని అందరూ భావిస్తుంటారు. కానీ మన చర్మం అలా ఉండడం అసాధ్యం అనే చెప్పాలి. కొన్నిసార్లు సూర్యకిరణాలు.. మరికొన్నిసార్లు అనారోగ్యం కారణంగా మచ్చలు, మొటిమలు, ముడతలు.. ఇలా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ

manavi

అందం

అందమైన కనుబొమలకోసం

03-01-2020

కొందరి కళ్లు చూసేకొద్దీ చూడాలని పిస్తుంటాయి. విశాలంగా ఉండటం ఒక కారణమైతే, విల్లులా వంపులు తిరిగిన కనుబొమలూ, రెప్పల వెంట్రుకలు దట్టంగా ఉండటం మరో కారణం. కొందరికి ఇవి ఊడిపోతుండటంతో కనుబొమలు

manavi

అందం

స్కిన్‌టోన్‌ పెంచే ప్యూమిస్‌ స్టోన్‌

02-01-2020

సాధారణంగా ప్యూమిస్‌ స్టోన్‌ను పాదాల స్క్రబింగ్‌కు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ చర్మపు మృత కణాల్ని తొలగించటంతోపాటు అవాంఛిత రోమాల్ని కూడా ప్యూమిస్‌ స్టోన్‌ తొలగించగలదు.

manavi

అందం

అవిసెలతో అందం..

30-12-2019

అవిసె గింజలు కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాత్రమే కాదు.. మన చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతూ మన అందాన్ని ద్విగుణీకతం చేసేందుకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మన చర్మానికి అందించే ప్రయోజనాలేంటంటే..

manavi

అందం

నడివయసులోనూ మెరిసే చర్మం..

29-12-2019

అందంగా ఆరోగ్యంగా కనిపించాలని అందరూ అనుకొంటారు. కానీ నడివయసు నాటికి చర్మం ముడతలు పడటం మొదలై క్రమంగా కాంతిని కోల్పోవటం మొదలవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా