అందాన్ని పెంచే గుడ్డు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

అందాన్ని పెంచే గుడ్డు

ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎంతగా ఉపయోగపడుతుందో సౌందర్య పోషణలోనూ అంతే పనికొస్తుంది. చర్మ సౌందర్యానికి గుడ్డు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
- గుడ్డులోని 'లూటిన్‌' అనే పదార్థం చర్మపు సాగే గుణాన్ని రెట్టింపు చేయటంతో బాటు చర్మంలో తగినంత తేమ నిలిచేలా చేస్తుంది. అందుకే తరచూ గుడ్డులోని తెల్లసొనను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత నీటితో కడిగితే మత కణాలు తొలగి వదులుగా ఉన్న చర్మం గట్టిపడటమే గాక మొటిమలు కూడా తగ్గుతాయి. కంటికింది వలయాలు, ఉబ్బినట్లు కనిపించటమూ ఉండదు.
- జిడ్డు చర్మం గలవారు గుడ్డుతెల్లసొన, చెంచా కొబ్బరి నూనె కలిపి రంగరించి వారానికి 3 సార్లు ముఖం, మెడ భాగాలకు బాగా పట్టించి గోరు వెచ్చని నీటితో కడిగేస్తే క్రమంగా జిడ్డు తొలగి పోవటమే గాక కాంతివంతం అవుతుంది.
- మీది పొడి చర్మం అయితే గుడ్డులోని పచ్చసొనలో అరచెంచా నిమ్మరసం, చెంచా తాజా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రంగరించి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే పొడిచర్మం తగినంత తేమను పొంది మదువుగా మారుతుంది.
- ముఖం మీద మొటిమల మచ్చలు, ఎండకు కమిలిన చర్మం ఉంటే గుడ్డు సొనలో చెంచా తేనె, అరచెంచా ఆలివ్‌ ఆయిల్‌, 2 చెంచాల రోజ్‌ వాటర్‌ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేస్తే ముఖ చర్మం మదువుగా, కాంతి వంతమవుతుంది. ఇలా రోజూ చేస్తే మచ్చలూ మాయమవుతాయి.
- ఎండ, కాలుష్యం కారణంగా దెబ్బ తిన్న చర్మానికి గుడ్డు పచ్చ సొనలో చెంచా చొప్పున తేనె, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి అరగంట తర్వాత చన్నీటితో శుభ్ర పరచుకుంటే చర్మం కోమలంగా మారుతుంది. 

అందాన్ని పెంచే గుడ్డు

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

తేజస్సు పెరిగేలా...

15-01-2020

ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం చాలా మందికి అలవాటు. ఒకవేళ ముఖం ఉబ్బరించి ఉంటే తెగ ఆందోళన పడతారు. అయితే ముఖంలో తగ్గిన తేజస్సుని కింద పేర్కొన్న ఈ సహజ విధానాల ద్వారా సులభంగా నివారించవచ్చు.

manavi

అందం

పొడి జుట్టుకు...

12-01-2020

చలికాలంలో మాడు భాగం దురద పెట్టడం, పొడిబారడం వంటి సమస్యలు వేధిస్తుం టాయి. ప్రొబయాటిక్స్‌ ఎక్కువగా తీసు కోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా ఈ సమస్యలు పరిష్కారమై, ఆరోగ్యకరమైన కురులు మీ సొంతమవుతాయి. కురుల సంరక్షణ కోసం చర్మ నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివి...

manavi

అందం

జుట్టు మెరిసేలా..

11-01-2020

పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టు అందానికి ప్రతీక. అయితే నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లు, తరచూ వాడే షాంపూలు, రంగుల వినియోగం వంటి కారణాల మూలంగా జుట్టు సహజ శోభను కోల్పోయి నిర్జీవంగా

manavi

అందం

అందాన్ని కాపాడే సులభమైన చిట్కాలు

08-01-2020

అందాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన చిట్కాల్లో మొదటిది.. సరిపడినంత నీటిని తాగడం. రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగడం ముఖ్యం. బ్యూటీ ప్రొడక్ట్స్‌ కొనడం కంటే వాటిని ఉపయోగించే విషయంలో శ్రద్ధ

manavi

అందం

మచ్చల్లేని చర్మం కోసం....

06-01-2020

మచ్చల్లేకుండా అందంగా, ప్రకాశవంతంగా చర్మం మెరిసిపోవాలని అందరూ భావిస్తుంటారు. కానీ మన చర్మం అలా ఉండడం అసాధ్యం అనే చెప్పాలి. కొన్నిసార్లు సూర్యకిరణాలు.. మరికొన్నిసార్లు అనారోగ్యం కారణంగా మచ్చలు, మొటిమలు, ముడతలు.. ఇలా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ

manavi

అందం

అందమైన కనుబొమలకోసం

03-01-2020

కొందరి కళ్లు చూసేకొద్దీ చూడాలని పిస్తుంటాయి. విశాలంగా ఉండటం ఒక కారణమైతే, విల్లులా వంపులు తిరిగిన కనుబొమలూ, రెప్పల వెంట్రుకలు దట్టంగా ఉండటం మరో కారణం. కొందరికి ఇవి ఊడిపోతుండటంతో కనుబొమలు

manavi

అందం

స్కిన్‌టోన్‌ పెంచే ప్యూమిస్‌ స్టోన్‌

02-01-2020

సాధారణంగా ప్యూమిస్‌ స్టోన్‌ను పాదాల స్క్రబింగ్‌కు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కానీ చర్మపు మృత కణాల్ని తొలగించటంతోపాటు అవాంఛిత రోమాల్ని కూడా ప్యూమిస్‌ స్టోన్‌ తొలగించగలదు.

manavi

అందం

అవిసెలతో అందం..

30-12-2019

అవిసె గింజలు కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాత్రమే కాదు.. మన చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతూ మన అందాన్ని ద్విగుణీకతం చేసేందుకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మన చర్మానికి అందించే ప్రయోజనాలేంటంటే..

manavi

అందం

నడివయసులోనూ మెరిసే చర్మం..

29-12-2019

అందంగా ఆరోగ్యంగా కనిపించాలని అందరూ అనుకొంటారు. కానీ నడివయసు నాటికి చర్మం ముడతలు పడటం మొదలై క్రమంగా కాంతిని కోల్పోవటం మొదలవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా