తులసితో అందం | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

తులసితో అందం

- ఎండు తులసి ఆకు పొడిని పౌడర్‌లా రోజూ ముఖానికి పట్టిస్తే ముఖం సౌందర్యవంతంగా, కాంతివంతంగా మారుతుంది. ఈ పొడి ముఖం మీద ఉండే పలుచనివే కాదు గాఢమైన మచ్చల్ని కూడా తొలగిస్తుంది.
- రోజూ కొన్ని తులసి ఆకుల్ని తినడం వల్ల రక్త శుద్ధి అవుతుంది. అలాగే తులసి పొడికి కొన్ని నీటి చుక్కలు కలిపిగానీ, పచ్చి తులసి ఆకులను నూరి ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టిస్తే అతి సూక్ష్మమైన మలినాలు సైతం తొలగిపోయి ముఖం సహజ లావణ్యాన్ని సంతరించుకుంటుంది.
- ఏదైనా పాత్రలో కాసిని మంచి నీళ్లు తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. అందులో ఓ పిడికెడు తులసి ఆకులు, పిడికెడు మెంతి ఆకులు వేసి కాసేపు మరగించాలి. జుట్టును టవల్‌తో కట్టేసుకుని ముఖానికి మాత్రమే ఆ ఆవిరి పట్టాలి. కొన్ని నిమిషాల తరువాత చన్నీళ్లతో ముఖం కడిగేసుకుంటే ముఖం తాజాగా మెరిసిపోతుంది.
- ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నవారు నిమ్మరసం లేదా అల్లం రసం కలిపిన తులసి పేస్టును ముఖానికి పట్టించి అది ఎండిపోయే దాకా అలాగే ఉంచాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మచ్చలు తొలగిపోవడంతో పాటు ముఖం కాంతి వంతంగా, అంద ంగా మారుతుంది.

తులసితో అందం

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

మేని ఛాయకు...

17-03-2020

ముఖం అందంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్‌లు తప్పనిసరి. అయితే వాటి కోసం వందలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు. బ్యూటీ పార్లర్‌లకు వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంత శ్రద్ధ,

manavi

అందం

టమాటాలతో నిగారింపు

10-03-2020

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం మామూలు విషయం కాదు. ఇందుకోసం చాలా మంది ఏవేవో క్రీములు వాడుతుంటారు. కానీ టమాటాలతో నిగారింపు కాపాడుకోవచ్చు. టమాటా ఫేస్‌ప్యాక్‌ను మనం ఇంట్లోనే

manavi

అందం

నల్లని వలయాల...

06-03-2020

ఈరోజుల్లో నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగాలు, పని ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్‌, రోజులో ఎక్కువ సమయం మొబైల్‌, టీవీ, కంప్యూటర్‌ వాడటం.. కారణమేదైనా కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ

manavi

అందం

ముఖం తాజాగా....

05-03-2020

బయటికి వెళ్తే చాలు.. వాహనకాలుష్యం, దుమ్ము, ధూళీ వల్ల చర్మం నల్లబడడం, జిడ్డుగా మారడం జరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే క్షణంలో మళ్ళీ ఫ్రెష్‌నెస్‌తోపాటు ఫ్రెష్‌ లుక్‌ వచ్చేస్తుంది. అది ఎలాగో చూద్దామా..

manavi

అందం

చర్మకాంతికి పిస్తా

01-03-2020

కాస్త ధర ఎక్కువే కానీ, అడపాదడపా చారెడంత పిస్తాపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్‌, ప్రొటీన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండే పిస్తాను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.

manavi

అందం

నల్లని జుట్టు కావాలంటే...

01-03-2020

ఒకప్పుడు వయసు మీద పడినప్పుడే వెంట్రుకలు తెల్లబడేవి. ఇప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు, కాలుష్యం, జీవనశైలి వంటి వాటి వల్ల త్వరగా తెల్ల జుట్టు వచ్చేస్తోంది. యుక్తవయస్సులో వద్ధాప్య ఛాయల్ని భరించడం ఎవరికైనా కష్టమే. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటిని పాటిస్తే తెల్లబడిన

manavi

అందం

పెరుగుతో అందం

29-02-2020

ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్య పరిరక్షణలోనూ అంతే మేలుచేస్తుంది .అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. - రోజూ గడ్డపెరుగును ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చన్నీటితో ముఖం కడుక్కొంటే తగినంత తేమ అందుతుంది. ఎండ, వేడి ధాటికి కమిలిపోయిన

manavi

అందం

మెరిసే చర్మానికి...

22-02-2020

ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది. స్నానం చేసే ముందు నీళ్ళలో పాలుకలిపి స్నానం చేస్తే చర్మం తళతళ మెరిసిపోతుంది.

manavi

అందం

కాటుక పెట్టుకునే ముందు...

20-02-2020

ఎంత చిన్న కళ్ళైనా రవ్వంత కాటుకతో అలంకరిస్తే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. కాటుక కళ్లు పలికే భావాలు ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతాయి. అయితే కాటుక వినియోగం విషయంలో ఈకింది అంశాలను పరిగణలోకి తీసుకుంటే కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. అవి..

manavi

అందం

ముడతల నివారణకు

17-02-2020

విటమిన్స్‌ లోపం, విపరీతమైన ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వంటి వివిధ కారణాల వల్ల అతి చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తాయి. ముఖం మీద వచ్చే మడతలు ముఖ కాంతిని దూరం చేయడమే కాకుండా వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. దాంతో ఎంతో మంది మహిళలు ఇబ్బంది