డల్‌గా కనిపిస్తుంటే... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

డల్‌గా కనిపిస్తుంటే...

ఆకర్షణీయమైన ముఖం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాం. అలాంటివారు ఈ కింది ఆరు సూత్రాలు పాటిస్తే ఆకర్షణీయమైన ముఖం మీ సొంతం. అవేంటో చూడండి.
- మీ చేతి వేళ్లతో మీ చర్మానికి జీవకళ తీసుకురావచ్చు, కంటిపై ఎముకభాగం నుండి ముక్కు వరకు అక్కడి నుండి బుగ్గల ఎముక భాగాల వరకు మీ చేతి వేళ్లతో పైకి కిందకు నెమ్మదిగా మర్దనా చేయండి.
- మర్దనా చేస్తూ మాయిశ్చరైజర్‌ను ముఖానికి పట్టించి మెడ కింది భాగం నుండి గడ్డం వరకు వేళ్లతో మర్దనా చేయాలి. ఇలా చేయడంతో మీ ముఖం కందినట్లు కనిపించినా, ముఖానికి కావలసినంత ఆక్సిజన్‌ లభిస్తుంది.
- నిద్రించేప్పుడు ముఖం పైకి ఉండేలా నిద్రించండి. పక్కకు, బోర్లా పడుకునే వారికి చర్మంపై ముడతలు త్వరగా ఏర్పడుతాయి.
- మసాజ్‌ సెంటర్లకు వెళ్లకుండా ప్రతీ రాత్రి మీకు నచ్చిన మాయిశ్చరైజర్‌తో ఐదు నిమిషాల పాటు ముఖంపై నెమ్మదిగా మర్దనా చేయండి. మసాజ్‌ చేయించుకున్నంత ఫలితం పొందుతారు.
- పరిశుభ్రమైన ఆహారంతో మీ చర్మానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. మీరు తీసుకునే ఆహారంతో మీ ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. తరచుగా చేపలు తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ అందించవచ్చు.
- కుడి చేయివాటం ఉన్న వారు ఎక్కువగా సన్‌స్క్రీన్‌లను ఎడమ వైపు పెడుతారని, ఎడమ చేయివాటం వారు కుడి వైపు ఎక్కువ క్రీం పూస్తారని దీంతో ముఖంపై రెండు వైపులా అసమతౌల్యంగా రాయడం జరుగుతుంది. క్రీం వాడేప్పుడు రెండు వైపులా రెండు చేతులతో మార్చి మార్చి రాయడంతో ముఖమంతా సమపాళ్లలో క్రీం పడుతుంది.

డల్‌గా కనిపిస్తుంటే...

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

జుట్టు రాలకుండా

14-04-2020

వాతావరణ కాలుష్యం ఒకవైపు ఏవేవో షాంపూలు వాడటంతో జుట్టు రాలే సమస్య తలెత్తుతోంది. వీటితోపాటు సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ల లోపం,

manavi

అందం

మేని ఛాయకు...

17-03-2020

ముఖం అందంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్‌లు తప్పనిసరి. అయితే వాటి కోసం వందలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు. బ్యూటీ పార్లర్‌లకు వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంత శ్రద్ధ,

manavi

అందం

టమాటాలతో నిగారింపు

10-03-2020

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం మామూలు విషయం కాదు. ఇందుకోసం చాలా మంది ఏవేవో క్రీములు వాడుతుంటారు. కానీ టమాటాలతో నిగారింపు కాపాడుకోవచ్చు. టమాటా ఫేస్‌ప్యాక్‌ను మనం ఇంట్లోనే

manavi

అందం

నల్లని వలయాల...

06-03-2020

ఈరోజుల్లో నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగాలు, పని ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్‌, రోజులో ఎక్కువ సమయం మొబైల్‌, టీవీ, కంప్యూటర్‌ వాడటం.. కారణమేదైనా కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ

manavi

అందం

ముఖం తాజాగా....

05-03-2020

బయటికి వెళ్తే చాలు.. వాహనకాలుష్యం, దుమ్ము, ధూళీ వల్ల చర్మం నల్లబడడం, జిడ్డుగా మారడం జరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే క్షణంలో మళ్ళీ ఫ్రెష్‌నెస్‌తోపాటు ఫ్రెష్‌ లుక్‌ వచ్చేస్తుంది. అది ఎలాగో చూద్దామా..

manavi

అందం

చర్మకాంతికి పిస్తా

01-03-2020

కాస్త ధర ఎక్కువే కానీ, అడపాదడపా చారెడంత పిస్తాపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్‌, ప్రొటీన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండే పిస్తాను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.

manavi

అందం

నల్లని జుట్టు కావాలంటే...

01-03-2020

ఒకప్పుడు వయసు మీద పడినప్పుడే వెంట్రుకలు తెల్లబడేవి. ఇప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు, కాలుష్యం, జీవనశైలి వంటి వాటి వల్ల త్వరగా తెల్ల జుట్టు వచ్చేస్తోంది. యుక్తవయస్సులో వద్ధాప్య ఛాయల్ని భరించడం ఎవరికైనా కష్టమే. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటిని పాటిస్తే తెల్లబడిన

manavi

అందం

పెరుగుతో అందం

29-02-2020

ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్య పరిరక్షణలోనూ అంతే మేలుచేస్తుంది .అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. - రోజూ గడ్డపెరుగును ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చన్నీటితో ముఖం కడుక్కొంటే తగినంత తేమ అందుతుంది. ఎండ, వేడి ధాటికి కమిలిపోయిన

manavi

అందం

మెరిసే చర్మానికి...

22-02-2020

ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది. స్నానం చేసే ముందు నీళ్ళలో పాలుకలిపి స్నానం చేస్తే చర్మం తళతళ మెరిసిపోతుంది.