మనమే ఒక బ్రాండ్‌ కావాలి | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవికెరీర్

మనమే ఒక బ్రాండ్‌ కావాలి

'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తాప్సీ.. 'ఛష్మే బద్దూర్‌' తో బాలీవుడ్‌ బోణీ కొట్టింది. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా... ఆమెకు నటిగా గుర్తింపునిచ్చింది బాలీవుడ్‌. 'నామ్‌ షబానా', 'పింక్‌', 'జుడ్వా -2', 'ముల్క్‌', 'మన్‌ మర్జియా', 'బద్లా' ఒక్కో సినిమాలో ఒక్కో విలక్షణమైన పాత్ర. సంప్రదాయాలను బద్దలు కొడుతూ, సవాళ్లకు ఎదురీదేవే. ఇంటెన్సివ్‌ క్యారెక్టర్‌ ఉన్న ఇంటెలిజెంట్‌ యువతి ఆమె. బాలీవుడ్‌ స్టార్‌డమ్‌ సంస్కృతిని అంటనీయని నిజాయితీ గల నటి. 'సినిమాలే కాదు... నా జీవితమే ప్రయోగం' అని చెప్పే తాప్సీ చాలాకాలం తరువాత తెలుగులో 'నీవెవరో' చేసింది. ఇటీవలే 'గేమ్‌ ఓవర్‌' విడుదలైంది.
మోడలింగ్‌ నుంచి...
నేనెప్పుడూ నటిని కావాలనుకోలేదు. చదువుతోపాటు స్పోర్ట్స్‌, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో అన్నింట్లో ముందుండేదాన్ని. స్కూల్‌, కాలేజీ స్థాయిలో స్పోర్ట్స్‌ ఆడాను. ఆల్‌రౌండర్‌ను. అటెండెన్స్‌ తక్కువ ఉన్నా... రిజల్ట్‌ మాత్రం బాగా వచ్చేది. మ్యాథ్స్‌ అంటే ఇష్టంతో ఇంజనీరింగ్‌ చేశాను. ఇంజనీరింగ్‌ అయిపోయిన తరువాత ఎంబీఏ చేసి తరువాత మార్కెటింగ్‌ ఫీల్డ్‌లోకి పోవాలన్నది ఆలోచన. అది కూడా మా పేరెంట్స్‌ కోసమే. నైన్‌ టు ఫైవ్‌ డెస్క్‌ జాబ్‌ చేయడం మాత్రం అస్సలు ఇష్టం ఉండకపోయేది. మోడలింగ్‌ చేస్తూ ఉండేదాన్ని. దాంతో సినిమా అవకాశాలు చాలా వచ్చాయి. కానీ ప్రారంభంలో వద్దనుకున్నాను. ఎందుకంటే స్టూడెంట్‌గా సినిమాలు కూడా ఎక్కువగా చూడకపోయేదాన్ని. చదువుల నుంచి బ్రేక్‌ తీసుకోవాలనుకున్నప్పుడు... సినిమాలకు ఓకే చెప్పాను. అదే 'ఝుమ్మంది నాదం'. యాక్టింగ్‌ స్కూల్‌లో కానీ, థియేటర్‌లో కానీ ప్రవేశం లేదు. నా పాత్రకు న్యాయం చేయడానికి వందశాతం ఎఫర్ట్స్‌ పెట్టాను. మొదటి సినిమా తరువాతే... ఈ వృత్తిని సీరియస్‌గా తీసుకోవాలనుకున్న. మంచి నటిని కావాలనుకున్న. దర్శకులు, సహ నటుల దగ్గరనుంచి నేర్చుకోవడం మొదలుపెట్టిన.
ఛష్మే బద్దూర్‌తో తెలిసొచ్చింది...
2010లో 'ఝుమ్మందినాదం' సినిమాతో నా ప్రయాణం మొదలైంది. ఇప్పటిదాకా 30 సినిమాలు చేశాను. నా మొదటి సినిమా సమయంలో నాకేమీ తెలియదు. కాకపోతే నేర్చుకోవాలనే తపనతో ఉన్నాను. తప్పులనుంచి ఎన్నో నేర్చుకున్నా. వాటిద్వారా మంచివి ఎంచుకోగలిగిన. మొదటి ఆరేండ్లు ఒక ఎత్తయితే... ఈమూడేండ్లు నా కెరీర్‌లో కీలకమైనవి. తొమ్మిదేండ్లల్లో సినిమాలను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకున్నా. నటీనటులను బట్టి గాక... స్క్రిప్ట్‌ను బట్టి ఓకే చేశాను. ఇండిస్టీ బయటి వ్యక్తిగా ప్రారంభంలో ఎలాంటి సినిమాలు చేయాలో చెప్పేవాళ్లు కూడా లేరు. ఓ ప్రేక్షకురాలిగా కథలు విని... ఓకే చేసేదాన్ని. ప్రారంభంలో తెలుగు, తమిళ సినిమాలు చేశాను. అవి నా భాష కాదు. కేవలం ఎమోషన్‌, సీన్‌ మీద ఆధారపడి నటించేదాన్ని. రానురాను భాషలు నేర్చుకున్నాను. బాలీవుడ్‌లో నా మొదటి సినిమా 'ఛష్మే బద్దూర్‌'తో సినిమాలో ఏమేం మ్యాజిక్కులు చేయొచ్చో తెలిసింది. అప్పటినుంచి అన్ని ప్రయోగాలే. ఒక్క 'సూర్మా' కోసం హాకీ ట్రైనింగ్‌ తప్ప.. ఏ సినిమాకీ ప్రత్యేకంగా వర్క్‌షాప్స్‌కు ఏం వెళ్లలేదు.
ఆ లక్ష్యం కోసమే...
సినిమాల్లో నన్ను ముందు హీరోయిన్‌గా అనుకుని... తరువాత నో చెప్పిన సందర్భాలు అనేకం. ఇలాంటి తొలినాళ్లలో అయితే ఇబ్బంది ఉండదు. కానీ... ఇన్ని సినిమాలు చేసిన తరువాత.. కూడా ఫలానా వాళ్ల కూతురో, ఫలానా వాళ్ల తాలూకు అని చెప్పి... నా క్యారెక్టర్‌ వేరేవాళ్లకు ఇస్తే బాధవుతుంది. అలా దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేం కదా. విజయం వచ్చినప్పుడు భుజం తట్టుకున్న ఆ చేతితోనే... సినిమాకు అవకాశం పోయినప్పుడు కూడా వెన్ను తట్టుకుంటాను. సినిమా నా చేతిల్లోంచి వెళ్లిపోవడం నాకు షాక్‌ అనిపించదు. ఎందుకంటే నాకు నటన రాదని ఆ సినిమాకు నన్ను తిరస్కరించలేదు. ఈ సినిమా 'నువ్వు తప్ప మరెవ్వరూ చేయలేరు. నీవు లేకుండా ఈ సినిమా ప్రాజెక్టు ముందుకెళ్లదు' అని దర్శక నిర్మాతలు అడిగే రోజు ఇండిస్టీలో రావాలని కోరుకుంటున్నాను. ఆ లక్ష్యం కోసమే శ్రమిస్తున్నాను.
స్టార్‌ని అనుకోను...
నేను స్టార్‌నని ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే స్టార్స్‌ సినిమాలు విడుదలయితే అది ఎలా ఉందనేది చూడకుండా అభిమానులు గుడ్డిగా వెళ్లి చూసేస్తారు. స్టార్‌డమ్‌ వాళ్లను అలా థియేటర్స్‌కు రప్పిస్తుంది. అలాంటి రోజు నాక్కూడా రావాలని కోరుకుంటున్నా. అప్పటిదాకా నేను సాధారణ నటిని మాత్రమే. సూర్మా స్పోర్ట్స్‌ బయోపిక్‌, ముల్క్‌ సోషల్‌ డ్రామా, మన్‌మర్జియా లవ్‌ స్టోరీ.. దేనికదే భిన్నమైన జానర్స్‌. నా సినిమా వంద కోట్ల క్లబ్‌లో లేకపోవచ్చు... కానీ నా పాత్రలతో కోట్ల మంది భారతీయ యువతులకు దగ్గరగా ఉంటున్నా. అది చాలు. సినిమాలను ఎంజారు చేస్తున్నా కాబట్టి ఇప్పుడు సినిమాలు చేస్తున్నా... అదే లేనినాడు సినిమాలు వదిలేస్తాను. ఎందుకంటే ఏ పనైనా ఇష్టంతో చేయాలి. బలవంతంగా లాక్కుపోయినట్టుగా ఉండకూడదు. ఇక వద్దు అనుకున్నప్పుడు పెండ్లి, ఇతర బిజినెస్‌లు చాలా ప్లాన్లున్నాయి.
ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇష్టం...
సినిమాలతో పాటు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నా. సినిమాలకు సంబంధం లేనిదాంట్లో పెట్టబడి పెట్టాలనుకున్నా. ఈవెంట్స్‌ చేయడం మా చెల్లికి ఆసక్తి. నేను, నా ఫ్రెండ్‌ కలిసి పెట్టుబడి పెట్టాం. నా పనులన్నీ మా చెల్లి చూస్తుంది. పెద్ద పెద్ద నిర్ణయాలప్పుడు మాత్రమే నేను ఉంటాను. మిగతా విషయాలన్నీ చెల్లి చూసుకుంటుంది. ఒక్కోసారి నేను కూడా వెళ్తాను. సినిమా ప్రపంచాన్ని పక్కనపెట్టి... డిఫరెంట్‌ వరల్డ్‌లో ఉన్నానన్న సంతోషం కలుగుతుంది. కానీ అక్కడ సెల్ఫీల బాధ ఉంటుంది. బట్టలు, యాక్సెసరీస్‌ కంటే.. ట్రావెలింగ్‌ మీద ఎక్కువ ఖర్చు పెడతాను. చాలామంది సెలబ్రిటీస్‌ బట్టలు వేసుకున్నవి మరోసారి వేయరు. కానీ రిపీటెడ్‌ క్లోత్స్‌ వేస్తాను. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేస్తాను. మీరు నమ్మరు కానీ.. కాలేజీ టైమ్‌లో కొన్న బట్టలు ఇంకా నా దగ్గర ఉన్నాయి. చాలామంది బ్రాండెడ్‌ వస్తువులకోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. బ్రాండెడ్‌వి ధరించడం ద్వారా మనకు పాపులారిటీ రావద్దు. మనమే ఒక బ్రాండ్‌ కావాలి. డైట్‌ పెద్దగా కంట్రోల్‌ చేసుకోను. ఉదయమే వేడినీళ్లు తాగుతా. తరువాత గ్రీన్‌ టీ. తరువాత జ్యూస్‌. బ్రేక్‌ ఫాస్ట్‌ లంచ్‌ హెవీగా తీసుకుని రాత్రి పూట తినకుండా ఉంటా. తిన్నా ఎనిమిది లోపే తింటా. ఆ తరువాత ఎప్పుడైనా ఆకలైతే సూప్‌లాంటివి తీసుకుంటా.
సగటు భారతీయ యువతిలా...
సినిమాలకంటే ముందు... టీషర్ట్‌ లేదా షర్ట్‌ విత్‌ జీన్స్‌ధరించేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక... చాలా మారింది. ఇక్కడేమో దివాలాగా కనిపించాలి. కానీ అవేవీ నాకు నప్పవని అర్థమయిపోయింది. ఎందుకంటే నేను సగటు భారతీయ యువతిలా ఉండాలనుకుంటాను. ఈ పర్ఫెక్ట్‌ దివాటైప్‌ మనకు సెట్‌ కావనిపించింది. ఇప్పుడు నాస్టయిల్స్‌ అన్ని స్టయిలిస్ట్‌ దేవకీభట్‌ చూస్తుంది. నేను ఏం ధరించినా క్రెడిట్‌ అంతా తనదే. నేను వేసుకున్న బట్టలతో నా పర్సనాలిటీ మరింత మెరుగ్గా ఉండాలి. అందుకే సింపుల్‌ వాటిని ఎంచుకుంటాం. ఫిట్‌నెస్‌కోసం జిమ్‌కు వెళ్తుంటా. డైట్‌ కూడా పాటిస్తుంటా. కానీ వీటన్నింటికంటే ఏదో ఒక స్పోర్ట్‌ ఆడుతుంటే మరింత ఫిట్‌గా ఉంటాం. నేను స్క్వాష్‌ ఆడుతుంటా. నేను కథక్‌ నేర్చుకున్నాను. ఎనిమిదేండ్ల వయసులో మొదటి ప్రదర్శన ఇచ్చాను. డ్యాన్స్‌ను బాగా ఎంజారు చేస్తాను. ఇప్పటిదాక ఎవరితో అయితే ప్రేమలో పడలేదు. ఒకవేళ ప్రేమలో పడినా... పెండ్లి చేసుకోవాలనుకున్నా బహిరంగంగా ప్రకటిస్తా. సినిమావాళ్లను కచ్చితంగా చేసుకోను. ఎందుకంటే... ఇంట్లో కూడా సినిమా వాతావరణమే నాకు నచ్చదు. సినిమాతో సంబంధంలేని ఓ కంపానియన్‌షిప్‌ కోరుకుంటున్నా.

మనమే ఒక బ్రాండ్‌ కావాలి

MORE STORIES FROM THE SECTION

manavi

కెరీర్

చదువులకు ఆర్థిక భరోసా...

12-07-2019

పిల్లల ఉన్నత భవిష్యత్‌ కోసం డబ్బు కూడబెట్టాలనేది తల్లిదండ్రుల ఆలోచన. కానీ ఆలోచించినంత వేగంగా ఆచరణలో పెట్టకపోవడమే చిక్కంతా. దీంతో లక్ష్యాలు ఉన్నా..

manavi

కెరీర్

ప్రశాంత జీవనం - కెరీర్‌ మార్గం

08-07-2019

మహిళలు మానసిక ప్రశాంతతతో జీవిస్తేనే ఇంటా, బయటా సత్సంబంధాలను అందించగలుగుతారు. ముఖ్యంగా ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే మహిళలైతే చెప్పనవసరం లేదు. నిద్రలేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులు.. అలాంటి హడావుడి

manavi

కెరీర్

అపార్థాలతో..!

06-07-2019

భర్త మీద పెట్టుకున్న నమ్మకం, కష్టపడి కట్టుకున్న ఇల్లు ఒకసారే చేజారి తాను ఒంటరిని అన్న వేదనలో బతుకుతుంది అశ్విని. రోజురోజుకు భర్తతో గొడవ

manavi

కెరీర్

ప్రేమమయి మృత్యుంజయి

30-06-2019

అబ్బూరి ఛాయాదేవి... సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. తొలితరం స్త్రీవాద రచయిత. తన కథల ద్వారా మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీల సమస్యలను కళ్లకు

manavi

కెరీర్

చెప్పుడు మాటలు వింటే..!

29-06-2019

రాఘవ ఊరికి వెళ్లి మూడునెలలు దాటింది. చంటిపిల్లాడిని వదిలి ఉద్యోగం చేసే పరిస్థితిలో జమున లేదు. నెలనెల రాఘవ పంపించే కొద్ది డబ్బులు ఇంటి కిరాయికి,

manavi

కెరీర్

ఆనంద సూత్రాలు

29-06-2019

'ఇవి ఆచరిస్తే ఆనందంగా ఉంటారు' అంటూ ఎవరైనా ఆనందానికి నిర్ధిష్ట మైన సూత్రాలు చెప్పేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఒక్కోసారి. అందుకే అలా ఎల్లవేళలా ఆనందంగా జీవించే వ్యక్తుల్లో

manavi

కెరీర్

కరచాలనం చేస్తున్నారా?

28-06-2019

కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడో లేక పాత పరిచయస్తుడే ఎక్కడన్నా తారసిల్లినప్పుడో కరచాలనం చేయడం సంప్రదాయం. మనం చేసే కరచాలనం మన స్వభావాన్ని

manavi

కెరీర్

ఆత్మ స్థయిర్యం ముఖ్యం

27-06-2019

అనారోగ్యం బారిన పడినప్పుడు ఆనందం ఆవిరైపోతుంది. బాధపడినంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అలా ఉండటానికి మాత్రం ఎవరూ ప్రయత్నించరు.

manavi

కెరీర్

పేరు వల్ల వేధించారు..

25-06-2019

భిన్నమైనదాన్ని అంగీకరించడానికి మన మనసులు ఒప్పవు. అందుకే...నల్లగుంటే తెల్లగున్నవాళ్ల వెక్కిరింతలు. లావుగా ఉంటే సన్నగా ఉన్నవాళ్ల అవహేళనలు. అలాగే