సంపద కన్నా సేవ గొప్పది | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవికెరీర్

సంపద కన్నా సేవ గొప్పది

ఆమె రైటర్‌ .. వెలుగులోకి వచ్చినవి కొన్ని రచనలే అయినా ఘోస్ట్‌గా ఎన్నో రాశారు. ఆమె సింగర్‌... రెండువందలకు పైగా ర్యాప్‌ సాంగ్స్‌లో యువతను హౌరెత్తించారు. ఆమె మోడల్‌... ప్రపంచ వ్యాప్తంగా ఎన్నోచోట్ల ఆమె చిత్రాలు ఆకట్టుకుంటాయి. ఆమె కంపోజిటర్‌, వందలాది స్వరాలను గీతాలుగా మలిచారు. ఆమె క్రియేటర్‌ సామాజిక సమస్యలపై, వ్యసనాలపై అవగాహన పెంచే ఆలమ్స్‌ చేశారు. ఇలా అనేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞతో ఆమె సంపాదించిన ప్రతి రూపాయి సామాజిక సేవ కోసమే వినియోగిస్తున్నారు. ఆమే ఫెబా మార్టిన్‌. మోడల్‌, ర్యాపర్‌, కంపోజిటర్‌, యాక్టర్‌ అన్నింటిని మించి మానవత్వం ఉన్న మనిషి. ఫెబా మార్టిన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె పరిచయం..
నాన్న బ్రిటిషర్‌ విక్టర్‌ సోలమన్‌ డాసన్‌. అమ్మ తమిళ హిందూ క్షత్రియ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. అమ్మ పేరు వరప్రసాదం. నాన్న అలా పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి నేను బోర్డింగ్‌ పాఠశాలల్లో చదువుకున్నాను. ఏడాదిలో రెండుసార్లు క్రిస్మస్‌, సమ్మర్‌ సెలవులకు మాత్రం ఇంటికి వచ్చేదాన్ని. ఆ కొద్ది రోజులు ఎంతో ఆనందంగా ఉండేదాన్ని. వారి నుంచే నాకు సంగీత, సాహిత్యంపై ఆసక్తి కలిగింది.
క్రియేటివిటీ పెంచే..
బోర్డింగ్‌ స్కూల్‌ పిల్లల క్రియేటివిటీ పెంచేలా కో కరిక్యులమ్‌ యాక్టివిటీస్‌ ఎక్కువగా ఉంటాయి. నేను ఎక్కువ సమయం నాలోని నైపుణ్యాలను మెరుగుపర్చడంపై దృష్టి పెట్టేదాన్ని. మంచిమంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. ఇంగ్లీష్‌, హిందీ లిటరేచర్‌ ఎక్కువగా చదివాను. పెయింటింగ్‌ ఇష్టంగా చేసేదాన్ని. బ్రిటిష్‌ కౌన్సిల్‌ జాతీయ అవార్డును రెండుసార్లు గెలుచుకున్నాను. గేమ్స్‌ బాగా ఆడేదాన్ని. జాతీయ అథ్లెట్‌, వాలీబాల్‌ డిఫెన్స్‌ ప్లేయర్‌గా మంచి గుర్తింపు ఉండేది. వీటితో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ లోనూ శిక్షణ తీసుకున్నాను. కరాటేలో పసుపు బెల్ట్‌ సాధించాను. ఒకవైపు ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌, మరో వైపు మ్యూజిక్‌, లిటరేచర. ఖాళీ సమయం అంటూ లేకుండా బిజీగా ఉంచేవి. ఇలా స్కూలింగ్‌, కాలేజ్‌ డేస్‌లో చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్‌లో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాను.
చాలా చిన్న వయసులోనే..
చదవడం బాగా ఇష్టం కాబట్టి రాయడం కూడా చిన్నతనంలోనే అలవాటైంది. ఆరేడు ఏండ్ల వయసులోనే నా భావాలను అక్షరాలుగా రాసేదాన్ని. మా టీచర్లు ఎంతో ప్రోత్సహించారు. ఆ తర్వాత నాకు రాయలనిపించినప్పుడలా రాసుకునే దాన్ని. బ్లాగ్‌లో రాయడం ప్రారంభించాను. చదువు పూర్తి అయిన తర్వాత ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ గా కొన్నేండ్లు పనిచేశాను. ఆ ఉద్యోగం నా అభిరుచికి సరికాదనిపించింది. అంతే ఉద్యోగం మానేసి పూర్తి స్థాయిలో సంగీత, సాహిత్య రంగంలో అడుగుపెట్టాను. అనేక వ్యాసాలతో పాటు ఒక నవల రాశాను.
హాలీవుడ్‌ స్క్రీస్‌ ప్లే రైటర్‌గా..
సింగర్‌గా, మ్యూజిక్‌ కంపోజిటర్‌గా జాతీయ స్థాయిలో చాలా అవార్డులను గెలుచుకున్నాను. దాంతో కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయి. చాలా సినిమాలకు, కంపోజిటర్‌గా చేశాను. హాలీవుడ్‌లో కొందరు స్నేహితుల సినిమాలకు ్‌ స్క్రీన్‌ ప్లే రాశాను. అయితే నేను ఎప్పుడు ఘోస్ట్‌ రైటర్‌గానే ఉండేదాన్ని. దాదాపు రెండువందలకు పైగా ర్యాప్‌ సాంగ్స్‌ పాడాను. కంపోజింగ్‌ చేశాను. పారిస్‌, ముంబయిలో ఉంటూ మోడలింగ్‌ చేస్తూ, విదేశాల్లో ప్రోగ్రామ్స్‌ ఇస్తూ ఎక్కువ ట్రావెలింగ్‌లో ఉండేదాన్ని. అవసరమైన సాంగ్‌ కంపోజింగ్‌ చేసి పంపించేదాన్ని. నాకు రావల్సిన డబ్బులు అకౌంట్‌లోకి వచ్చేవి. దాంతో వ్యక్తిగతంగా నాకు గుర్తింపు కావాలని, రావాలని ఆశించలేదు. అందుకే ఘోస్ట్‌ రైటర్‌ గానే ఎక్కువగా వర్క్‌ చేశాను.
సేవ కోసం..
నేను సంపాదించిన ప్రతి రూపాయి సేవ కోసమే వినియోగిస్తున్నాను. అయితే చాలామంది స్నేహం పేరుతో నాతో వర్క్‌ తీసుకున్న వారు కనీసం నేమ్‌కార్డు కూడా వేయకపోవడం బాధఅనిపించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్‌ గారు మాత్రం నేమ్‌ ఇచ్చారు. తెలియనివారు మోసం చేస్తే ఆ బాధ కొంతే ఉంటుంది. తెలిసినవారు, స్నేహితులు అనుకున్నవారు మోసం చేస్తే ఆ బాధ ఎక్కువ. ఘోస్ట్‌గా ఉండటం ఇష్టం లేక గత రెండేండ్లుగా నేను ఆల్బమ్స్‌ చేస్తున్నాను. ఇందులో స్క్రిప్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌, మోడలింగ్‌ అన్ని నేనే. వీటి ద్వారా వచ్చే డబ్బంతా నా ఛారిటీ వర్క్స్‌ నడపడానికి ఉపయోగిస్తున్నాను. ఇందుకోసం 'ఫెబా మార్టిన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌' ఏర్పాటు చేశాను. నేను విరాళాలు తీసుకోను. మా ప్రోగ్రామ్స్‌కు స్పాన్సర్‌ చేస్తే చాలు. వాటి ద్వారా వచ్చే డబ్బంతా సేవ కోసమే వినియోగిస్తున్నాను.
15 మంది ఆడపిల్లలకు అమ్మగా..
సమాజంలో దీనస్థితిలో ఉన్నవారికి అండగా నిలబడుతున్నాను. 15 మంది హెచ్‌ఐవి పాజిటివ్‌, ఎయిడ్స్‌తో బాధపడుతున్న అమ్మాయిలను దత్తత తీసుకున్నాను. వారికి చట్టపరమైన సంరక్షకురాలిని. వారికి కావల్సిన విద్య, వైద్య, వసతి సదుపాయాలన్నీ కల్పిస్తున్నాను. ముంబయి, థానేలలోని ప్రభుత్వ అధికారులు విస్మరించిన నల్లజాతి విదేశీయుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాను. మహిళలకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించడానికి ఇటీవల ఏర్పాటు చేసిన షీ-టీం కమిటీలో సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్వేతరెడ్డితో కలిసి పనిచేస్తున్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు రూపకల్పన చేసే ప్రయత్నం చేస్తున్నాను.
నటన దిశగా..
ఇప్పటివరకు తెరవెనుక మాత్రమే పనిచేశాను. మోడల్‌గా, స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసినా సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు నేను నటించిన టాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ''డిగ్రీ కళాశాల'' ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరో టాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ప్రాసెస్‌లో ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గారు కొన్ని పాటలు రాసే పని ఇచ్చారు. అలాగే ప్రముఖ దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మగారితో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహిస్తున్న వెబ్‌ సిరీస్‌లో గేయరచయిత, గాయకుడు, స్వరకర్తగా అవకాశం ఇచ్చారు. టాలీవుడ్‌ దర్శకులు నివాస్‌, నాని ఆచార్య, యాదవ్‌ రెడ్డి, రఘువర్ధన్‌ రెడ్డి, బెంగాలీ దర్శకులు ఆనందీదా దాస్‌ గుప్తా, సునంద మిత్రా, ఖురేషి సాంగర్‌వాలా తదితరులకు కంపోజిటర్‌గా వర్క్‌ చేస్తున్నాను. పారిస్‌లో ఐ ఫౌండేషన్‌ బ్రాండ్‌తో మోడల్‌ అంబాసిడర్‌గా కూడా పనిచేస్తున్నాను, ఛత్తీస్‌గఢ్‌ టూరిజం అండ్‌ ఫ్యాషన్‌ వీక్‌ కోసం షో స్టాపర్‌గాను పని చేస్తున్నాను. ఇండియాలో మరికొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తూ పారిస్‌లో స్ట్రీట్‌, స్టేజ్‌ షోల కోసం ఎఫ్‌ఎమ్‌సిటి టీమ్‌ సంగీతకారులు క్రిస్టియన్‌ కాజాబోన్నే, జువాన్‌ జెసి టిబ్‌, అలాన్‌ అలక్సాండర్‌లతో కలిసి మ్యూజిక్‌ జర్నీని కొనసాగిస్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా పారిస్‌, ముంబై-హైదరాబాద్‌-చెన్నై మధ్య ట్రావెల్‌ చేస్తున్నాను.
వ్యసనాల బారిన పడినవారిని..
సిగరెట్‌ , మద్యం, డ్రగ్స్‌ ఇలా కొన్ని వ్యసనాలు యువత జీవితాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. వాటి బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు ఇప్పటికే అడిక్షన్‌కు లోనైనవారిని రక్షించేలా కొన్ని థెరపీలు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా అడిక్షన్‌ థెరపీలో శిక్షణ పొందిన నా పెట్‌ డాగ్‌ టఫీ ఎంతో బాగా పనిచేస్తోంది. వివిధ వ్యసనాలతో అణగారిన యువత, ఆటిస్టిక్‌ పరిస్థితులతో బాధపడుతున్న పిల్లలకు థెరపీ టఫీని ఉపయోగిస్తాను. నేను చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలకు కరంవీర్‌ చక్ర అవార్డుకు గత ఏడాది నవంబర్‌లో నామినేట్‌ అయ్యాను. కానీ నేను దానిని తిరస్కరించాను. నేను చేసే సేవా కార్యక్రమాలన్నీ యూట్యూబ్‌ ఛానల్‌ ' ఫెబా మినిస్ట్రీస్‌'లో అందుబాటులో ఉంటాయి. గత ఏడాది నేను రూపొందించిన స్మోగింగ్‌ కిల్స్‌, మాధాపిచ్చి ×× (యాంటీ రేప్‌ సాంగ్‌) నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
సాహిత్యం, సంగీతం, స్టేజ్‌ షోలు, ఆలమ్స్‌ ఇలా వీలైన అన్ని మాధ్యమాల ద్వారా సామాజిక అంశాలపై యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను.

సంపద కన్నా సేవ గొప్పది

MORE STORIES FROM THE SECTION

manavi

కెరీర్

రీఛార్జ్‌ చేసుకుంటేనే...

20-02-2020

కొంతమంది అదేపనిగా ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఫలితం.. తెలియని నిర్లిప్తత, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తెలియని అనారోగ్యంతో సతమతమవటం. ఆ ఇబ్బందులు ఏవీ వద్దు అనుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ చేసుకుంటుండాలి. అందుకు

manavi

కెరీర్

అల్లరి చేయాలని చూస్తే..!

08-02-2020

క్లాస్‌ రూంలోనూ, సినిమా హాల్స్‌లోనూ ముందు వరుసలో కూర్చున్న అమ్మాయిలను కాలితో తాకే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది అమ్మాయిలు మౌనంగా భరిస్తారు. సీట్‌లో కాస్త ముందుకు జరిగి

manavi

కెరీర్

ఆర్థిక విషయాల్లో... అనుగుణంగా..

04-02-2020

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. కొత్త దంపతులు డబ్బుకు సంబంధించిన విషయాల గురించి కొన్నేళ్లపాటు పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, ఆధునిక కాలంలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఉపాధి వేటలో నవ దంపతులు ఉమ్మడి

manavi

కెరీర్

భుజంపై చేయివేస్తే..!

01-02-2020

ఆడపిల్లలను టీజ్‌ చేసి ఏడిపించే వారి సంఖ్య పెరిగింది. ఒంటరిగా ఆడపిల్లలను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులకు భయంగా ఉంటుంది. అయితే ఆడపిల్లలకు ఆత్మరక్షణగా కరాటే నేర్పిస్తే ఎలాంటి

manavi

కెరీర్

ఈ స్నేహితులు ఉన్నారా?

21-01-2020

మనకున్న స్నేహితుల జాబితాలో కొందరు మనకు సన్నిహితం అయితే, మరికొందరు హారు, హలో చెప్పుకునే బందమే ఉంటుంది. ఈ రెండు వర్గాలు సరే.. అసలు మన జీవితంలో ఎలాంటి స్నేహితులు ఉండాలో తెలుసా..

manavi

కెరీర్

అమ్మతనం అడ్డేంకాదు..!

21-01-2020

ఒక మేరీ కోమ్‌.. ఒక సెరెనా.. ఒక సానియా మీర్జా.. ఒక లాల్‌వెంట్‌ లుయాంగీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో మహిళలు చరిత్రలో తమ స్థానాన్ని పదిలంగా దాచుకున్నారు. ప్రపంచ స్థాయిలో తమ సత్తాను

manavi

కెరీర్

కొత్త ఆవిష్కరణలు...

18-01-2020

తరాలు మారిపోతున్నాయి. దాంతో పాటు వారి స్వరాలు మారుతున్నాయి. ఇప్పటి జనరేషన్‌ పుట్టుకతో వృద్ధులు కాదు. వారంతా చాలా స్మార్ట్‌, సో స్మార్ట్‌. గత తరాలతో పోలిస్తే వారికి సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంటుంది. సమాచార విప్లవం వారిలో కొత్త ఆలోచనలకు పదును పెడుతుంది. నేటి యువతలో