ఈ స్నేహితులు ఉన్నారా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవికెరీర్

ఈ స్నేహితులు ఉన్నారా?

మనకున్న స్నేహితుల జాబితాలో కొందరు మనకు సన్నిహితం అయితే, మరికొందరు హారు, హలో చెప్పుకునే బందమే ఉంటుంది. ఈ రెండు వర్గాలు సరే.. అసలు మన జీవితంలో ఎలాంటి స్నేహితులు ఉండాలో తెలుసా..
వ్యక్తిగత విషయాలు పంచుకునేందుకు: ఇలాంటివారు కనీసం ఒక్కరయినా మనకు ఉండాలి. వాళ్లతో మనం వాదించొచ్చు, గొడవపడొచ్చు, వ్యక్తిగత విషయాలెన్నో మాట్లాడుకోవచ్చు. అంటే తను మన కుటుంబంలో ఓ భాగం కావాలి. మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని, మనం తీసుకునే నిర్ణయాన్ని తనకు తెలియజేసేలా ఉండాలి. సలహాలు ఇచ్చేందుకు: ఈ కోవకు చెందిన స్నేహితురాలు అన్నీ తెలిసినదై ఉండాలి. అంటే తన ఆలోచనా పరిధి
విస్తతంగా ఉండాలి. మీకు ఏ చిన్న సాయం కలిగినా తను చేయగలిగినదై ఉండాలి. ఏదయినా ఓ సమస్య వస్తే.. తను ఉంది కదా అనే ధైర్యం మీలో ఉండాలి.
సరదాగా నవ్వుకునేందుకు: కొందరు మాట్లాడితే హాయిగా నవ్వుకోవచ్చు. కొన్నిసార్లు వాళ్ల మాటల వల్ల ఇబ్బంది కలిగినా సరే.. హాయిగా నవ్వుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏ కష్టంలో ఉన్నా కూడా ఇలాంటి వాళ్లతో కాసేపు మాట్లాడితే హాయిగా అనిపించేలా ఉండాలి.
సంగీతం ఇష్టపడేవారు: మనం ఏ మాత్రం బాధలో ఉన్నా.. ఈ తరహా స్నేహితులు మన మూడ్‌ని పెంచేందుకు సరైన సలహా ఇస్తారు. అప్పుడప్పుడూ పాటలు పాడుతూ మానసిక సాంత్వననూ అందిస్తారు.
వయసులో చిన్నవారు, పెద్దవారు: మీ అనుభవాలు చిన్నవాళ్లతో పంచుకోవచ్చు. అదే సమయంలో వాళ్లు అనుసరించే ఫ్యాషన్లూ, ఆధునిక సాంకేతికత గురించి తెలుసుకోవచ్చు. మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ు

ఈ స్నేహితులు ఉన్నారా?

MORE STORIES FROM THE SECTION

manavi

కెరీర్

రీఛార్జ్‌ చేసుకుంటేనే...

20-02-2020

కొంతమంది అదేపనిగా ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఫలితం.. తెలియని నిర్లిప్తత, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తెలియని అనారోగ్యంతో సతమతమవటం. ఆ ఇబ్బందులు ఏవీ వద్దు అనుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ చేసుకుంటుండాలి. అందుకు

manavi

కెరీర్

అల్లరి చేయాలని చూస్తే..!

08-02-2020

క్లాస్‌ రూంలోనూ, సినిమా హాల్స్‌లోనూ ముందు వరుసలో కూర్చున్న అమ్మాయిలను కాలితో తాకే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది అమ్మాయిలు మౌనంగా భరిస్తారు. సీట్‌లో కాస్త ముందుకు జరిగి

manavi

కెరీర్

ఆర్థిక విషయాల్లో... అనుగుణంగా..

04-02-2020

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. కొత్త దంపతులు డబ్బుకు సంబంధించిన విషయాల గురించి కొన్నేళ్లపాటు పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, ఆధునిక కాలంలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఉపాధి వేటలో నవ దంపతులు ఉమ్మడి

manavi

కెరీర్

భుజంపై చేయివేస్తే..!

01-02-2020

ఆడపిల్లలను టీజ్‌ చేసి ఏడిపించే వారి సంఖ్య పెరిగింది. ఒంటరిగా ఆడపిల్లలను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులకు భయంగా ఉంటుంది. అయితే ఆడపిల్లలకు ఆత్మరక్షణగా కరాటే నేర్పిస్తే ఎలాంటి

manavi

కెరీర్

అమ్మతనం అడ్డేంకాదు..!

21-01-2020

ఒక మేరీ కోమ్‌.. ఒక సెరెనా.. ఒక సానియా మీర్జా.. ఒక లాల్‌వెంట్‌ లుయాంగీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో మహిళలు చరిత్రలో తమ స్థానాన్ని పదిలంగా దాచుకున్నారు. ప్రపంచ స్థాయిలో తమ సత్తాను

manavi

కెరీర్

సంపద కన్నా సేవ గొప్పది

19-01-2020

ఆమె రైటర్‌ .. వెలుగులోకి వచ్చినవి కొన్ని రచనలే అయినా ఘోస్ట్‌గా ఎన్నో రాశారు. ఆమె సింగర్‌... రెండువందలకు పైగా ర్యాప్‌ సాంగ్స్‌లో యువతను హౌరెత్తించారు. ఆమె మోడల్‌... ప్రపంచ వ్యాప్తంగా

manavi

కెరీర్

కొత్త ఆవిష్కరణలు...

18-01-2020

తరాలు మారిపోతున్నాయి. దాంతో పాటు వారి స్వరాలు మారుతున్నాయి. ఇప్పటి జనరేషన్‌ పుట్టుకతో వృద్ధులు కాదు. వారంతా చాలా స్మార్ట్‌, సో స్మార్ట్‌. గత తరాలతో పోలిస్తే వారికి సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంటుంది. సమాచార విప్లవం వారిలో కొత్త ఆలోచనలకు పదును పెడుతుంది. నేటి యువతలో