'భగీరథ' బామ్మ | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవికెరీర్

'భగీరథ' బామ్మ

ఈ రోజుల్లో చాలామంది 30 ఏండ్లు రాగానే...ఇంకేం చదువుతామని చదివే చదువును కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగాన్ని చూసేసుకుని సెటిలైపోతున్నారు. కానీ ఓ బామ్మకు మాత్రం వందేళ్లు దాటినా చదువుపై ఆసక్తి తగ్గలేదు. అందుకే 105 ఏండ్ల వయసులోనూ చదువుకోవాలని పరితపించింది. కుటుంబ సభ్యుల సాయంతో తాను చిన్నతనంలో మధ్యలోనే ఆపేసిన నాలుగోతరగతి పరీక్షలు రాసింది. అంతేకాదు మంచి మార్కులు సంపాదించి అందరిచే ఔరా అనిపిస్తుంది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న బామ్మ పేరు భగీరథీ అమ్మాళ్‌. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన ఈ బామ్మ పేరుకు తగ్గట్టే చదువుకునేందుకు భగీరథ ప్రయత్నం చేసింది. చదువుపై ఉన్న ఆసక్తితో 105 ఏండ్ల వయసులోనూ స్కూలు బాట పట్టింది. నాలుగో తరగతి పరీక్షలు రాసి 74.5 శాతం మార్కులు సాధించి ... అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. అంతేకాదు కేరళలోనే అత్యంత ముసలి విద్యార్థినిగా కేరళ స్టేట్‌ లిటరసీ మిషన్‌ నుండి గుర్తింపు పొందింది.
బాల్యంలోనే బాధ్యతలు
ఈ బామ్మ చిన్నతనంలో మూడో తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగింది. ఆ తర్వాత తన కుటుంబంలో తనకంటే చిన్నవారిని చూసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. అలా తను తన చదువును త్యాగం చేసి... వాళ్లను పెంచి పెద్ద చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొడుకులు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి, వాళ్లకు పుట్టిన పిల్లల్ని చూసుకోవడంతోనే సరిపోయింది. కానీ నాలుగో తరగతి చదవలేకపోయానన్న బాధ బామ్మ మనసులో అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న లిటరసీ మిషన్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఆమెను దగ్గరుండి చదివించి... పరీక్షలు రాయించారు. అందులో 275 మార్కులకు 205 మార్కులు సాధించింది.
గ్రేట్‌ గ్రాండ్‌ మదర్‌
ఈ వయసులోనూ పట్టుదలగా పరీక్షలు రాసి... ఏకంగా 74.5 శాతం స్కోర్‌ సాధించి... గ్రేట్‌ గ్రాండ్‌ మదర్‌ అనిపించుకుంటోంది భగీరథీ. మన దేశంలో ఇప్పటికీ కొంతమంది చదువుకొమ్మంటే అంతగా ఆసక్తి చూపరు. మరీ ముఖ్యంగా పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో పడిపోయి తమ గురించి తామే మర్చిపోతారు. కొంతమంది చదువుకుందామన్నా పేదరికం, ఆర్థిక సమస్యలు వెక్కిరిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ భగీరథీ అమ్మాళ్‌ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

'భగీరథ' బామ్మ

MORE STORIES FROM THE SECTION

manavi

కెరీర్

అందమైన మనసు

19-03-2020

స్త్రీలు జుట్టుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అవి తమ సౌందర్యాన్ని రెట్టింపుచేస్తాయి. అందుకే ఒక్క వెంట్రుక రాలినా భరించలేరు. జుట్టు పొడువుగా, అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఓ

manavi

కెరీర్

కుటుంబ పోషణ కోసం...

19-03-2020

బాబీతాయి అవాలే... మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌ జిల్లాలోని తిల్వానీ గ్రామంలో జీవిస్తుంది. కుటుంబ పోషణ కోసం ఆమె ఎన్నో ఏండ్లుగా టైర్ల పంక్చర్‌ షాపు నడుపుతున్నారు. స్కూటీలు మొదలు కుని టాటా సుమో, బుల్లెట్‌తో సహా ఏ

manavi

కెరీర్

మీ ఇష్టాలను గుర్తించండి

17-03-2020

ఉన్న ఓ పెద్ద సమస్య ఏంటంటే.. కుటుంబ సభ్యుల్లోన్ని అన్ని కళలనీ గుర్తిస్తారు.. వారికి అన్నీ అమరుస్తూ పైకి వచ్చేలా చూస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి తరువాత చూద్దాంలే అనుకుం టారు. ఓ సంగీతమో,

manavi

కెరీర్

పుస్తకాలు చదివితే...

17-03-2020

జీవితం అందంగా, సరదాగా కనిపించాలన్నా.. మన జీవితమంటే మనకు బోల్డంత ఇష్టం రావాలన్నా.. ఏదైనా సమస్య ఎదురవగానే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నా.. న్యాయంగా ఆలోచించాలన్నా.. నిర్ణయం

manavi

కెరీర్

కృషి చేస్తే విజయం మనదే

12-03-2020

ఓలా క్యాబ్‌ డ్రైవర్స్‌లో కస్టమర్ల నుండి అద్భుతమైన రేటింగ్‌ సంపాదించిన అతి కొద్దిమంది డ్రైవర్లలో బెంగుళూరుకు చెందిన మహాలక్ష్మి ఒకరు. 14 ఏండ్ల వయసు లోనే కుటుంబం కోసం ఓ ఇంట్లో పనికి కుదిరిన ఆమె మహిళా డ్రైవర్‌గా మారిపోయింది.

manavi

కెరీర్

భయాలు అధిగమించేలా...

10-03-2020

మరి కొద్ది రోజుల్లో పిల్లలకు పరీక్షలు మొదలు కానున్నాయి. పిల్లలకు పరీక్షలంటే ఇటీవల తల్లిదండ్రులకే పరీక్షల్లా మారి పోయింది. ఈ కాలంలో ఫియర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ ఫెయిల్యూర్‌ అనే మాట బాగా వినబడుతుంది.

manavi

కెరీర్

స్నేహం పదిలం...

29-02-2020

పంచుకోవటం ద్వారా అంకురించే భావన స్నేహం. నీది, నాది అనే భావన స్థానంలో మనదనే భావన ఇది. ఊహ తెలిసినప్పటి నుంచి జీవితపు చివరి క్షణం వరకూ మనిషికి అన్ని విధాలా ఆలంబనగా నిలిచేది స్నేహమే. ప్రతి స్నేహితుడినీ ప్రత్యేకంగా భావించి అందరితో మంచి సంబంధాలు

manavi

కెరీర్

మిస్సి గరిమ...

27-02-2020

నెలసరి సమయంలో అపరిశుభ్రపద్ధతుల్లో వాడే బట్ట కన్నా .. నేడు వాడుతున్న శానిటరీ నాప్కిన్స్‌ మహిళలకు ఎంతో ఊరటనిచ్చాయి. ఎన్నో వ్యాధుల నుండి బయటపడేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాడి పారేసే ఈ నాప్కిన్స్‌ వల్ల చెత్త పెరిగిపోతుంది. అదొక పర్యావరణ

manavi

కెరీర్

రీఛార్జ్‌ చేసుకుంటేనే...

20-02-2020

కొంతమంది అదేపనిగా ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఫలితం.. తెలియని నిర్లిప్తత, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తెలియని అనారోగ్యంతో సతమతమవటం. ఆ ఇబ్బందులు ఏవీ వద్దు అనుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ చేసుకుంటుండాలి. అందుకు