కృషి చేస్తే విజయం మనదే | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవికెరీర్

కృషి చేస్తే విజయం మనదే

ఓలా క్యాబ్‌ డ్రైవర్స్‌లో కస్టమర్ల నుండి అద్భుతమైన రేటింగ్‌ సంపాదించిన అతి కొద్దిమంది డ్రైవర్లలో బెంగుళూరుకు చెందిన మహాలక్ష్మి ఒకరు. 14 ఏండ్ల వయసు లోనే కుటుంబం కోసం ఓ ఇంట్లో పనికి కుదిరిన ఆమె మహిళా డ్రైవర్‌గా మారిపోయింది. ఇప్పుడు తన స్నేహి తులకు, బంధువులకు, కస్టమర్లకు సెలబ్రటీ అయిపోయింది. ఆమె స్ఫూర్తి దాయక జీవితం గురించి... చిన్న వయసు నుండే ఆత్మవిశ్వాసం గల అమ్మాయి మహాలక్ష్మి. అందుకే పదో తరగతి పూర్తవగానే కుటుంబానికి అండగా నిలబడాలనుకుంది. అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడా పని దొరకలేదు. చివరకు బెంగుళూరు లోనే ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆ పని చేస్తూనే డ్రైవింగ్‌ నేర్చుకుంది. ఆమె ఆసక్తిని చూసి కుటుంబం కూడా ప్రోత్సహిం చింది. అదే సమయంలో ఓలా మహిళా డ్రైవర్లను చేర్చుకోబో తుటున్నట్టు పేపర్‌ ప్రకటన చూసింది. ఆ ప్రకటన ఆమెలో కొత్త ఆశలను రేకెత్తించింది.
స్వతంత్రంగా ఎదగడానికి
''క్యాబ్‌ డ్రైవర్‌గా చేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇలాంటి ఓ అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అయినా అవకాశం వచ్చినప్పుడు వదులుకోలేదు. ఓలా తన సంస్థలో మహిళా డ్రైవర్లను చేర్చుకుంటామని ప్రకటన ఇచ్చినప్పుడు ఇది నేను స్వతంత్రంగా ఎదగడానికి మంచి అవకాశంగా భావించాను. వెంటనే ఓలాలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాను'' అంటున్నారు మహాలక్ష్మి
కుటుంబ సహకారంతోనే..
అలా ఓలాలో తన పేరు నమోదు చేసుకున్న మహాలక్ష్మి మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటికి ఆమె ఓలాలో చేరి ఐదేండ్లు. వృత్తి రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఎంత కష్టమైనా కస్టమర్లు చేరాల్సిన గమ్యానికి జాగ్రత్తగా చేర్చడం తన బాధ్యగతా భావిస్తారు. మహలక్ష్మికి ఇద్దరు పిల్లలు. అటు డ్రైవింగ్‌, ఇటు కుటుంబం రెండు పనులు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ''నా కుటుంబం నాకు అండగా నిలిచింది. నా విజయానికి మూలం నా కుటుంబమే. వారి మద్దతుతోనే నా వృత్తి నాకు సులభమయింది'' అంటూ ఆమె గర్వంగా చెబుతున్నారు.
అనేక ప్రాంతాలు
అప్పటి వరకు బెంగుళూరు దాటని మహాలక్ష్మి డ్రైవర్‌గా వృత్తి రీత్యా బెంగుళూరు చుట్టుపక్కల అనేక ప్రదేశాలకు వెళ్ళగలిగారు. ఎంతో సమాజాన్ని చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆమెకు ఇష్టమైన చెన్నై, మైసూర్‌, గోవాతో సహా అనేక నగరాలు చుట్టివచ్చారు. బెంగుళూరులో ఏకైక మహిళా ఓలా అవుట్‌ స్టేషన్‌ డ్రైవర్‌గానే కాక ఎప్పుడూ తను చూస్తాను అనుకోని గోవా, మైసూర్‌ వంటి ప్రాంతాలు చూడడం ఎంతో గర్వంగా భావిస్తున్నారు.
కష్టం చేసే వారికే గుర్తింపు...
మహాలక్ష్మి ఓ మహిళ కావడంతో మహిళా కస్టమర్లు ఆమె క్యాబ్‌ ఎక్కేందుకు ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా రాత్రి సమయంలో మహిళా కస్టమర్లను వారి గమ్యాలకు చేర్చడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ''నా వృత్తి నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబాన్ని కూడా పోషించుకోగలుగుతున్నా. ఐదేండ్లు డ్రైవర్‌గా చేస్తూ సొంతంగా నడుపుకుంటున్నాను. నా పని గంటలను నేనే నిర్ణయించుకోగలుగుతున్నా. ఓలాలో చేరిన తర్వాత నా ఆదాయం గణనీయంగా పెరిగింది. కష్టం చేసే వారిని సమాజం ఎప్పటికీ గుర్తిస్తుంది, గౌరవిస్తుంది అనే నమ్మకం వచ్చింది'' అంటున్నారు ఆమె.
పిల్లలు గర్వంగా చెబుతుంటారు
మహాలక్ష్మి తను సాధించిన ఆర్థిక స్వాతంత్య్రంతో తన పిల్లలను మంచి పాఠశాలలో చదివిస్తున్నారు. అదే తన అతి పెద్ద విజయంగా చెబుతారు ఆమె. తన స్నేహితుల్లో, బంధువుల్లో, కస్టమర్లలో తను ఇప్పుడు ఓ సెలబ్రటీ. ''నా డ్రైవింగ్‌ చూసి కస్టమర్లు ప్రశంసిస్తుంటారు. నాతో సెల్ఫీలు కూడా తీసుకుంటారు. అప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. నా పిల్లలైతే 'మీ అమ్మ క్యాబ్‌ డ్రైవ్‌ చేస్తుంది' అంటూ నా గురించి స్నేహితులు, ఉపాధ్యాయులు గొప్పగా అంటుంటారని చాలా గర్వంగా చెబుతుంటారు. ఇది నాలో మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది'' అంటూ ఆనందంగా చెబుతున్నారు.
శక్తి అందరిలో ఉంది
ఈ రోజు ఆమె తన తోటి వారికే కాక, కస్టమర్లకు కూడా ఎంతో స్ఫూర్తినిస్తున్న మహిళ. చిన్న వయసులోనే స్వయం సమృద్ధి సాధించారు. ఎంతో పట్టుదలతో పురుషుల ఆధిపత్యం ఉన్న వృత్తిలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఆమెలోని పట్టుదలకు, నిబద్ధతకు నిదర్శనం. ''చాలా మంది యువతులు నా వద్దకు వచ్చి వారికి నేనెంతో స్ఫూర్తినిస్తున్నానని అంటుంటారు. వారికి నేను ఒకటే చెబుతా.. మీ నేపథ్యం ఏదైనా మీ కలలను నిజం చేసుకునే శక్తి మీలో ఉంది. మీ భవిష్యత్‌ను మీరే నిర్ణయించుకోగలరు. ఎంచుకున్న మార్గానికి కట్టుబడి కృషి చేస్తే విజయం మనదే'' అంటున్నారు మహాలక్ష్మి.

కృషి చేస్తే విజయం మనదే

MORE STORIES FROM THE SECTION

manavi

కెరీర్

అందమైన మనసు

19-03-2020

స్త్రీలు జుట్టుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అవి తమ సౌందర్యాన్ని రెట్టింపుచేస్తాయి. అందుకే ఒక్క వెంట్రుక రాలినా భరించలేరు. జుట్టు పొడువుగా, అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఓ

manavi

కెరీర్

కుటుంబ పోషణ కోసం...

19-03-2020

బాబీతాయి అవాలే... మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌ జిల్లాలోని తిల్వానీ గ్రామంలో జీవిస్తుంది. కుటుంబ పోషణ కోసం ఆమె ఎన్నో ఏండ్లుగా టైర్ల పంక్చర్‌ షాపు నడుపుతున్నారు. స్కూటీలు మొదలు కుని టాటా సుమో, బుల్లెట్‌తో సహా ఏ

manavi

కెరీర్

మీ ఇష్టాలను గుర్తించండి

17-03-2020

ఉన్న ఓ పెద్ద సమస్య ఏంటంటే.. కుటుంబ సభ్యుల్లోన్ని అన్ని కళలనీ గుర్తిస్తారు.. వారికి అన్నీ అమరుస్తూ పైకి వచ్చేలా చూస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి తరువాత చూద్దాంలే అనుకుం టారు. ఓ సంగీతమో,

manavi

కెరీర్

పుస్తకాలు చదివితే...

17-03-2020

జీవితం అందంగా, సరదాగా కనిపించాలన్నా.. మన జీవితమంటే మనకు బోల్డంత ఇష్టం రావాలన్నా.. ఏదైనా సమస్య ఎదురవగానే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నా.. న్యాయంగా ఆలోచించాలన్నా.. నిర్ణయం

manavi

కెరీర్

భయాలు అధిగమించేలా...

10-03-2020

మరి కొద్ది రోజుల్లో పిల్లలకు పరీక్షలు మొదలు కానున్నాయి. పిల్లలకు పరీక్షలంటే ఇటీవల తల్లిదండ్రులకే పరీక్షల్లా మారి పోయింది. ఈ కాలంలో ఫియర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ ఫెయిల్యూర్‌ అనే మాట బాగా వినబడుతుంది.

manavi

కెరీర్

స్నేహం పదిలం...

29-02-2020

పంచుకోవటం ద్వారా అంకురించే భావన స్నేహం. నీది, నాది అనే భావన స్థానంలో మనదనే భావన ఇది. ఊహ తెలిసినప్పటి నుంచి జీవితపు చివరి క్షణం వరకూ మనిషికి అన్ని విధాలా ఆలంబనగా నిలిచేది స్నేహమే. ప్రతి స్నేహితుడినీ ప్రత్యేకంగా భావించి అందరితో మంచి సంబంధాలు

manavi

కెరీర్

మిస్సి గరిమ...

27-02-2020

నెలసరి సమయంలో అపరిశుభ్రపద్ధతుల్లో వాడే బట్ట కన్నా .. నేడు వాడుతున్న శానిటరీ నాప్కిన్స్‌ మహిళలకు ఎంతో ఊరటనిచ్చాయి. ఎన్నో వ్యాధుల నుండి బయటపడేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాడి పారేసే ఈ నాప్కిన్స్‌ వల్ల చెత్త పెరిగిపోతుంది. అదొక పర్యావరణ

manavi

కెరీర్

'భగీరథ' బామ్మ

23-02-2020

ఈ రోజుల్లో చాలామంది 30 ఏండ్లు రాగానే...ఇంకేం చదువుతామని చదివే చదువును కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగాన్ని చూసేసుకుని సెటిలైపోతున్నారు. కానీ ఓ బామ్మకు మాత్రం వందేళ్లు దాటినా చదువుపై ఆసక్తి తగ్గలేదు. అందుకే 105 ఏండ్ల వయసులోనూ

manavi

కెరీర్

రీఛార్జ్‌ చేసుకుంటేనే...

20-02-2020

కొంతమంది అదేపనిగా ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఫలితం.. తెలియని నిర్లిప్తత, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తెలియని అనారోగ్యంతో సతమతమవటం. ఆ ఇబ్బందులు ఏవీ వద్దు అనుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ చేసుకుంటుండాలి. అందుకు